కొవిడ్‌ తగ్గినా...దూరం పెడుతున్నారు!
close
Updated : 01/10/2020 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ తగ్గినా...దూరం పెడుతున్నారు!

నాకు కొవిడ్‌  పాజిటివ్‌ వచ్చి తగ్గింది. రెండు వారాలపాటు ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత విధులకు హాజరుకావచ్చు అన్నారు  డాక్టర్‌.  నేను ఎందుకైనా మంచిదని నెల రోజులు సెలవు తీసుకుని ఈమధ్యే ఆఫీసుకు వెళుతున్నా. కానీ నా సహోద్యోగి ప్రవర్తనన ఎంతో ఇబ్బంది కలిగిస్తోంది. నా నుంచి కరోనా మిగతావారికి వ్యాపిస్తుందని వదంతులు పుట్టిస్తున్నారు. ఇలా నా గురించి మాట్లాడటం నాకెంతో మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆమె నన్ను నేరుగా అడిగితే సమాధానం చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ఇదే విషయాన్ని మా సూపర్‌వైజర్‌ దృష్టికి తీసుకెళ్లాను. కానీ ఆయన ఇంతవరకు దీని గురించి ఆమెతో మాట్లాడినట్టు కనిపించడం లేదు. నేనే ఆమెతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నా. ఇది కరెక్టేనా?

- ఓ సోదరి

మీ ఆరోగ్య పరిస్థితి గురించి సహోద్యోగి నేరుగా మిమ్మల్నే అడిగి ఉంటే బాగుండేది. అలాకాకుండా ఇతరులతో చర్చించడం మీకు బాధని కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఎవరున్నా మీలాగే స్పందిస్తారు. మీరు నేరుగా ఆమెతో మాట్లాడండి. అయితే వాదనకు దిగుతున్నట్టుగా కాకుండా.. ‘నా నుంచి ఇతరులకు కరోనా అంటుకుంటుందని మీరన్నారని విన్నాను. ఇది నిజమేనా?’ అని అడగండి. ఆమె సమాధానం విన్న తర్వాత ఇలా చెప్పండి. ‘నా ఆరోగ్యానికి సంబంధించి మీకెలాంటి సందేహాలున్నా ముందుగా నాతో మాట్లాడండి. నా గురించి ఇతరుల ముందు మాట్లాడవద్దు’ అని మర్యాదగా చెప్పండి. అలాగే మీకు కరోనా వచ్చిన విషయాన్ని మీరేమీ రహస్యంగా దాచిపెట్టలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని కేంద్రంగా చేసుకుని వదంతులు సృష్టించడం ఎంత మాత్రం సరికాదు. ‘వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన ఈ విషయం ఎంతో సున్నితమైంది. దీన్ని నలుగురితో చర్చించడం వల్ల నేను ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నాను’ అని స్పష్టంగా చెప్పండి. ఆరోగ్యం మెరుగై విధుల్లో చేరిన మీ పట్ల మానవత్వంతో వ్యవహరించాలిగానీ ఇలా ప్రవర్తించడం ఎంతమాత్రం సరికాదు. ఆఫీసులో ఒకరికొకరు సహకరించుకుంటూ మీకోసం మేమున్నామన్న భరోసాను అందివ్వాలి. ఇలాంటివాళ్ల ప్రవర్తనను తేలిగ్గా తీసుకుని.. సానుకూల దృక్పథంతో ధైర్యంగా ముందడుగు వేయండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని