పతికోసం పట్టుదలగా..
close
Published : 20/10/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పతికోసం పట్టుదలగా..

సావిత్రి... పాతివ్రత్యానికే కాదు పట్టుదలకూ ప్రతీక. కారుణ్యానికే కాదు కార్యదక్షతకూ నిదర్శనం.

స్త్రీ తన కుటుంబం పాలిట ఓ దేవత. ఇంటిని చక్కబెట్టుకోవడమే కాదు జీవితంలో ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను అధిగమించడంలోనూ ఆమె ఔన్నత్యం దాగి ఉంటుంది. జీవుల చావు-పుట్టుకలకు కర్మలు కారణమవుతాయి. దీనికి సత్యవంతుడు సైతం మినహాయింపేమీ కాదు. పన్నెండేళ్ల  సావిత్రికి ఆయన భర్త. ఆమె అత్తమామలు అంధులు. సత్యవంతుడు పూర్వ కర్మవశాన పాముకాటుతో మరణించాడు. యముడు వచ్చి అతడి ప్రాణాలను తీసుకొని వెళ్లిపోతున్నాడు. సావిత్రి కూడా ఆయన వెంటపోసాగింది. పాంచభౌతిక దేహంతో తనను వెంబడించలేవని యముడు హెచ్చరించాడు.  తన భర్తలేనిదే తాను లేనంది.  పతి ప్రాణాలు ఇస్తే ఆయన సేవ చేసుకుంటూ ముక్తి పొందుతానని ప్రాధేయపడింది. స్వకులోద్ధరణ పతివ్రత ధర్మం కాబట్టి తన కోరికను మన్నించాలంది. వీలు కాదన్నాడు యముడు. అందుకు ప్రతిగా మూడు వరాలిస్తానన్నాడు. అంత క్లిష్ట సమయంలోనూ ఆమె తన సంయమనాన్ని కోల్పోలేదు. దుఃఖాన్ని దిగమింగుతూనే తెలివిగా ఆలోచించింది. తనకు పుత్ర ప్రాప్తి కావాలని కోరుతూ యముడిని ఇరుకున పెట్టింది. తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని