ముఖం జిడ్డుగా మారుతోంది
close
Published : 23/10/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముఖం జిడ్డుగా మారుతోంది

నా చర్మం జిడ్డుగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఎక్కువగా బయటకు వెళుతుంటాను. కడుక్కున్న మూడు గంటల్లోనే ముఖం మళ్లీ జిడ్డుగా మారుతోంది. నా చర్మతత్వానికి ఏ ఫేస్‌వాష్‌, మాయిశ్చరైజర్‌ సరిపోతుందో చెప్పండి. - ఓ సోదరి
ముఖం జిడ్డుగా మారడానికి జన్యుపరమైన కారణాలు, హార్మోన్లలో తేడాలు, సీబమ్‌ ఎక్కువగా ఉత్పత్తి అవడం, ఒత్తిడికి గురికావడం.. లాంటివి ఉంటాయి.
జాగ్రత్తలు: గోరువెచ్చని నీళ్లతో రోజూ రెండుసార్లు ముఖాన్ని కడుక్కోవాలి. ఎక్కువ సువాసన, మాయిశ్చరైజర్‌ ఉన్న సబ్బుల్లో గాఢమైన రసాయనాలను వినియోగిస్తారు. వీటివల్ల సీబమ్‌ ఉత్పత్తి పెరుగుతుంది.  
ఆహార నియమాలు: ఆహారంలో ప్రొటీన్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఎక్కువగా ఉండేలా చూడాలి. రోజూ వ్యాయామం చేయాలి.
చిట్కాలు: ముల్తానీ మట్టిని నీటిలో కలిపి ముఖానికి రాసి ఆరాక శుభ్రం చేసుకోవాలి. ముఖానికి తేనె రాసినా మంచిదే.
ఓట్స్‌ పొడిలో నిమ్మరసం కలిపి కూడా రాసుకోవచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని