పిల్లలు గమనిస్తారు...
close
Published : 02/11/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలు గమనిస్తారు...

పిల్లల పెంపకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతుంటారు. అలాంటివారిలో మీరు ఉన్నారా... అయితే ఇది మీ కోసమే.
* చిన్నారుల బలాలను గుర్తించి ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేయలి. సాధించగలమనే నమ్మకాన్ని చిన్నతనం నుంచీ పెంచాలి.
* ప్రవర్తనా పరమైన పొరపాట్లను ఎప్పటికప్పుడు గుర్తించి సరిదిద్దాలి. పిల్లలు ఏదైనా తప్పుచేస్తే వెంటనే వాళ్ల మీద గట్టిగా అరవడం, దండించడం చేయకూడదు. ఆ పొరపాటును మళ్లీ మళ్లీ చేయకుండా ఉండేలా అర్థమయ్యేలా చెప్పాలి.
* పిల్లల బలహీనతలు తల్లిదండ్రులకు స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి వాటిని అధిగమించడంలో వారికి సహకరించాలి తప్ప కోప్పడకూడదు.
* చిన్నారులు ఎలాంటి సంకోచం లేకుండా తమ భావాలను తల్లిదండ్రులతో పంచుకునేలా ప్రోత్సహించాలి. ఇలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆలోచించగలుగుతారు.
* అమ్మానాన్నల సెల్‌ఫోన్లు తీసుకుని ఎక్కువ సమయం గడుపుతుంటారు కొందరు పిల్లలు. అలాంటివారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఏయే వెబ్‌సైట్లు, వీడియోలు చూస్తున్నారో గమనిస్తుండాలి.
* పిల్లలెప్పుడూ తల్లిదండ్రులను గమనిస్తూ, అనుకరించడానికే ప్రయత్నిస్తారు. వాళ్లకు మీరే రోల్‌మోడల్‌. మీరు అతిగా ప్రవర్తిస్తే వాళ్లూ అదే నేర్చుకుంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ఓర్పుతో వ్యవహరించాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని