గర్భిణికి షుగరు పెరిగితే ఇబ్బందా?
close
Published : 19/11/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గర్భిణికి షుగరు పెరిగితే ఇబ్బందా?

మా కోడలికి అయిదో నెల. రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉన్నాయి. దాంతో వైద్యులు ఆహారం తగ్గించమన్నారు. పోషకాలు తగ్గిస్తే బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం ఉంటుందేమోనని భయంగా ఉంది. ఇలా చక్కెర స్థాయులు పెరగడం వల్ల కలిగే నష్టాలేంటి?

- ఓ సోదరి

కొంతమంది గర్బిణులకు రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే ఆస్కారం ఉంటుంది. గతంలో కుటుంబంలో ఎవరికైనా ఇలానే వచ్చినా, గర్భం దాల్చేనాటికి అధిక బరువు, గర్భధారణ సమయంలో అవసరానికి మించి బరువు పెరగడం, హార్మోన్ల అసమతుల్యం... లాంటి కారణాలవల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరగొచ్చు. 20-24 వారాల్లో చేసే పరీక్ష ద్వారా చక్కెర స్థాయులు పెరిగాయా లేదా అన్నది తెలుస్తుంది. పెరిగిన చక్కెర స్థాయులు తల్లీ, బిడ్డా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఏమీ తినకముందు 90 మి.గ్రా., తిన్న రెండు గంటలకు 120 మి.గ్రా. దాటకూడదు. ఇందుకోసం పోషకాహార నిపుణులు తల్లికీ, బిడ్డ ఎదుగుదలకూ కావాల్సిన పోషకాల్ని పట్టికగా తయారుచేసి ఇస్తారు. ఆ మేరకు మాత్రమే కెలొరీలు తీసుకుంటే బిడ్డ ఎదుగుదలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ చక్కెరస్థాయులు నియంత్రణలో లేకపోతే.. బిడ్డ బరువు ఎక్కువవడం, ఉమ్మనీరు పెరగడం, ముందుగానే ప్రసవమవడం, సిజేరియన్‌... లాంటి సమస్యలొస్తాయి.
ఈ సమయంలో తక్కువ గ్లైసిమిక్‌ లోడ్‌ ఉన్న గింజధాన్యాలు, పండ్లు, పొట్టుతో ఉండే ధాన్యాలు తీసుకోవాలి. పాలిష్‌ చేసిన బియ్యం, సేమ్యా, రవ్వ, బ్రెడ్‌, మైదా లాంటివి వాడొద్దు. ఆహారాన్ని కొద్దిమొత్తంలో నాలుగు గంటలకోసారి తీసుకోవాలి. ప్రొటీన్‌ కోసం పొట్టుతో ఉన్న పప్పులు, చేపలు, గుడ్డు, సోయా నగెట్స్‌, తక్కువ నూనెతో వండిన చికెన్‌ తినొచ్చు. సలాడ్లు, తక్కువ నూనెతో చేసిన ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. స్వీట్లూ, పండ్ల రసాలూ, మిల్క్‌షేక్‌లూ, ఐస్‌క్రీమ్‌లూ తగ్గించాలి. ఆహారపట్టిక ఒక్కో గర్భిణికి ఒక్కోలా ఉంటుంది. దీన్ని పాటిస్తూనే, వైద్యుల సూచనలతో తేలికైన వ్యాయామాలు చేస్తే రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించుకోవచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని