పిల్లలకు మేకప్‌ వేస్తున్నారా?
close
Updated : 20/11/2020 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలకు మేకప్‌ వేస్తున్నారా?

కొంతమంది రోజూ పిల్లలకు లిప్‌స్టిక్‌, ఐలైనర్‌, ఫౌండేషన్‌ క్రీమ్‌లు రాయడం లాంటివి చేస్తుంటారు. మీరూ అలాగే చేస్తున్నారా? అయితే ఒక్క నిమిషం... పిల్లలకు అసలు మేకప్‌ వేయొచ్చా? ఏ వయసు నుంచి వేయాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోకుండా వేస్తే మాత్రం కష్టమే.
సాధారణంగా పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అధిక రసాయనాలున్న మేకప్‌ వస్తువులను ఉపయోగించడంవల్ల వారికి చర్మ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ. అందుకే పదిహేనేళ్లు దాటే వరకు హెవీ మేకప్‌ జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. చిన్న వయసు నుంచే మేకప్‌ వేయడం వల్ల చర్మం సహజ తేమను కోల్పోయి గరుకుగా మారే ప్రమాదమూ ఉంది.
* కొన్నిసార్లు పిల్లలు డాన్స్‌ ప్రోగ్రామ్‌లకు, ఏవైనా వేడుకలకు వెళ్లాలన్నప్పుడు తప్పక మేకప్‌ వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వారి చర్మతత్త్వం ఏమిటి? వారికి మేకప్‌ వేయడంవల్ల ఏదైనా సమస్య వస్తుందా? లాంటి విషయాలను చర్మ నిపుణులను అడిగి వారి సలహా మేరకు వేయడం మంచిది. అప్పుడు కూడా చాలా తక్కువ మోతాదులో రసాయనాలున్న మేకప్‌ సామగ్రినే వాడాలి. అలాగే మేకప్‌ని తీసేసేటప్పుడూ  జాగ్రత్తలను పాటించాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని