అమ్మ కడుపులోనే అలా..
close
Published : 07/12/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ కడుపులోనే అలా..

కొంతమంది చిన్నవయసులోనే పెద్దవాళ్లలా కనిపిస్తారు. ఈ అకాల వృద్ధాప్యానికి కారణం... కాలుష్యమో, మరొకటో అని తేలిగ్గా తీసుకుంటాం. కానీ అసలు విషయం అదికాదు. తల్లికడుపులో ఉండగా బిడ్డపై పడిన తీవ్రమైన ఒత్తిడి ప్రభావమే ఈ అకాల వృద్ధాప్యానికి కారణమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. టెలోమెర్స్‌.... షూ లేస్‌కి చివర ఒక ప్లాస్టిక్‌ క్యాప్‌ ఉంటుంది గమనించారా? అదే లేకపోతే ఆ లేసు పాడవుతుంది. టెలీమెర్స్‌ కూడా మన క్రోమోజోమ్స్‌ చివర క్యాపుల మాదిరిగా ఉండి వాటిని సంరక్షిస్తుంటాయి. ‘అయితే ఒత్తిడి ఎక్కువగా ఉన్న గర్భిణులకు పుట్టిన పిల్లల్లో ఈ టెలోమెర్స్‌ చిన్నవిగా అయిపోతుంటాయి. అలా అవడం వల్ల పుట్టబోయే పిల్లలకు భవిష్యత్తులో గుండెజబ్బులు, క్యాన్సర్లు, అకాల వృద్ధాప్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని’ లాస్‌యాంజెల్స్‌కి చెందిన ఓ పరిశోధన సంస్థ తేల్చింది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే గర్భిణి తొలి మూడునెలల్లో ఒత్తిడికి దూరంగా ఉండాలని ఈ అధ్యయనం చెబుతోంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని