కనుబొమలు ఒత్తుగా పెరగాలంటే...
close
Published : 07/12/2020 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కనుబొమలు ఒత్తుగా పెరగాలంటే...

నా వయసు 24. ఐబ్రోస్‌ చాలా పలచగా ఉంటాయి. పెన్సిల్‌తో తీర్చిదిద్దుకున్నా కృత్రిమంగానే కనిపిస్తున్నాయి. ఇవి నల్లగా, ఒత్తుగా పెరగడానికి ఏమైనా చిట్కాలు  ఏమైనా చెప్పండి.

- శారద, హైదరాబాద్‌

జాగ్రత్తలు: ఒత్తిడిని తగ్గించుకుని పోషకాహారం తీసుకోండి. కనుబొమలను ట్రిమ్‌ చేసుకునే క్రమంలో గట్టిగా లాగకూడదు.  క్రీముల్లో రసాయనాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. అలాగే టేబుల్‌స్పూన్‌ ఆముదంలో టీస్పూన్‌ కొబ్బరినూనె కలిపి రోజూ రాత్రి కనుబొమలకు రాస్తే ఒత్తుగా పెరుగుతాయి.
కనుబొమలు పలచగా కావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా పలచగా ఉంటే మీకూ అలాగే ఉంటాయి. కొందరికి వయసు పెరిగేకొద్దీ పలచగా అవుతాయి. అలాగే ఎక్కువగా మేకప్‌ వేసుకున్నా, అదే పనిగా ఐబ్రో పెన్సిల్‌ వాడినా, షేపింగ్‌ చేసినా పలచగా అవుతాయి. అంతేకాకుండా ఇతర ఇన్‌ఫెక్షన్లు, హోర్మోన్ల తేడాలు, పోషకాహార లేమి, ఒత్తిడి వల్ల కూడా ఇలా అవుతాయి.
ఆహార లోపాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్యాట్‌, ఫైబర్‌, అమైనో, ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, మినరల్స్‌... ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఏవి లోపించినా ఈ సమస్య వస్తుంది. ఉదాహరణకు జింక్‌, విటమిన్‌-ఎ లోపిస్తే సెల్యులోజ్‌ పెరుగుదల తగ్గి ఐబ్రోస్‌ పలచబడతాయి. ముఖ్యంగా బయోటిన్‌, విటమిన్‌-సి, ఇ, బి12, డి16, ఐరన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వీటిల్లో ఏవి తగ్గినా సమస్యే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని