చీరను వేలం పెట్టి...
close
Published : 08/12/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చీరను వేలం పెట్టి...

చిన్నారులు కథల ద్వారా విజ్ఞానాన్ని పొందుతారు. పేద పిల్లలకూ ఆ అవకాశాన్ని అందించడానికి తనవంతు సేవనందించాలనుకుంటోంది ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌. ఈ దిశగా తనకిష్టమైన ఓ చీరను వేలంలో ఉంచింది. తద్వారా వచ్చే నగదును టీసీఎల్పీ నిర్వహిస్తున్న కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్టుకు విరాళంగా అందిస్తానని చెప్పింది. ‘దేశంలో ఎక్కడికెళ్లినా ఆయాప్రాంతంలో నేసే చీరలను సేకరించడం నా అలవాటు. అలాగే వాటిని అప్పుడప్పుడు పంచిపెట్టడం కూడా నా హాబీనే. పుస్తకపఠనం కూడా నాకు చాలా ఇష్టం. సమయం ఉన్నప్పుడల్లా నా చుట్టూ పుస్తకాలే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు పేద పిల్లలకు పుస్తకపఠనంపై ఆసక్తిని పెంచి, వారిలో విజ్ఞానాన్ని పెంపొందించే కమ్యూనిటీ లైబ్రరీ ప్రాజెక్టులో నేను కూడా భాగస్వామురాలిని అవుతున్నా. అందుకే నాకిష్టమైన ప్యూర్‌ టస్సర్‌ శారీని ఆన్‌లైన్‌లో వేలంలో ఉంచుతున్నా. దీన్ని అమ్మగా వచ్చే నగదును లైబ్రరీకి అందిస్తా. దేశవ్యాప్తంగా ఈ తరహా ఉచిత లైబ్రరీలు మరిన్ని రావాలని కోరుకుంటున్నా’ అని చెబుతోందీ విద్యాబాలన్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని