బాబు అన్నం తినట్లేదు!
close
Published : 09/12/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాబు అన్నం తినట్లేదు!

బాబు వయసు మూడున్నరేళ్లు. కొన్నాళ్ల కిందట వాంతులు, విరోచనాలయ్యాయి. దాంతో మందులు వాడాం. అప్పట్నుంచి సరిగా అన్నం తినడంలేదు. తను అన్నం తినాలంటే ఏం చేయాలి?

- భవ్య, హైదరాబాద్‌

మీ బాబు అన్నం తినకపోవడానికి చాలా కారణాలుండొచ్చు. తనకు కొన్నిరకాల ఆహార పదార్థాలు పడకపోవడం. పొట్టలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉండటం. గతంలో ఇన్‌ఫెక్షన్‌ తగ్గడానికి వాడిన యాంటీబయోటిక్స్‌ ప్రభావంవల్ల కూడా ఆకలి మందగించవచ్చు. మందుల ప్రభావం ముఖ్యంగా నోటిపై పడుతుంది. ఇలా మందులు వేసుకున్న చిన్నారులకు రుచి తెలియకపోవడం లేదా ఏ ఆహారం తీసుకున్నా కారంగా అనిపించడం జరుగుతుంది. బాబుకు అన్నమే పెట్టాలనేం లేదు. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు కొద్దికొద్దిగా ఎక్కువసార్లు అందించాలి. అన్నం, కారం, పాలు, పాల పదార్థాలు ఇవ్వకుండా సేమ్యా ఉప్మా, బియ్యంతో చేసిన నూడుల్స్‌, సగ్గుబియ్యం ఉప్మా, కిచిడి, ఇడ్లీ, కార్న్‌ఫ్లేక్స్‌ ఇస్తుండాలి. పండ్ల రసాలూ ఇవ్వొచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని