అమ్మమ్మల కథలు... నీతి సుధలు!
close
Updated : 14/12/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మమ్మల కథలు... నీతి సుధలు!

రెక్కల గుర్రాలు, ఎగిరే ఏనుగు, పలికే జింక, నడిచే చేప, పగడపు దీవులు... ఇలా నమ్మశక్యంకాని విషయాలెన్నో అమ్మమ్మా, తాతయ్యలు చెప్పే కథల్లో ఉంటాయి. అందులో ఎన్నో నీతి బోధలూ దాగుంటాయి. అలాంటి కథల్ని చిన్నారులకు చెప్పడంలో ముందుంటారు సుధామూర్తి. కొవిడ్‌ నేపథ్యాన్ని జోడించి తాజాగా మరో ఆసక్తికర కథల పుస్తకాన్ని తెచ్చారామె! 

చిన్నపుడు అమ్మమ్మా, తాతయ్యలు చెప్పిన కథలు వింటూ పెరిగిన సుధామూర్తి రచయితగా మారి ఆ కథలతో ఎన్నో పుస్తకాలు రాశారు. తాజాగా ‘గ్రాండ్‌పేరెంట్స్‌ బ్యాగ్‌ ఆఫ్‌ స్టోరీస్‌’ అనే మరో పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇదో కథల సమాహారం. ‘ఈ లాక్‌డౌన్‌ సమయంలో నేనో చిన్నారిగా పల్లెటూరులోని అమ్మమ్మా, తాతయ్యల దగ్గర చిక్కుకుని ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నా. ఆ సమయంలో అమ్మమ్మా, తాతయ్య ఎలా స్పందించేవారో ఆలోచించా. అవే ఈ కథలు రాయడానికి స్ఫూర్తి’ అంటారు సుధా.

ఈ కథల పుస్తకంలో ప్రధాన పాత్రలైన అజ్జా, అజ్జీ(తాత, అమ్మమ్మ)లు ఉండే శిగ్గా గ్రామంలో లాక్‌డౌన్‌ కారణంగా మనుమలు ఉండిపోతారు. ఆ పిల్లలు పెద్దవాళ్లతో కలిసి ఇంటిపనీ, తోటపనీ చేసుకుంటూ, పనివాళ్లకు వడ్డిస్తూ, మాస్కులు కుడుతూ ఉంటారు. ఇవన్నీ చేస్తూనే రోజూ రాత్రిళ్లు రాజూ రాణీ... ఎగిరే గుర్రాలూ, పగడపు దీవులు... ఉండే కథల్ని పెద్దవాళ్ల దగ్గర వింటుంటారు. ఆ గ్రామంలో ఉన్నన్ని రోజులూ పిల్లలు మరో ప్రపంచంలోకి అడుగుపెడతారు. అక్కడ ఎన్నో సరదాలూ, బంధాలూ వారి సొంతమవుతాయి. అంతేకాదు గ్రామం నుంచి నగరానికి తిరిగి వచ్చేసరికి వారి ఊహాశక్తి, తెలివితేటలూ ఎంతో మెరుగవుతాయి. ఇలాంటి ఆసక్తికరమైన కథలెన్నో ఈ పుస్తకంలో కనిపిస్తాయి. పిల్లలకు వినోదంతోపాటు విజ్ఞానాన్నీ అందిస్తాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని