‘ఏంటమ్మా’ అనడిగితే ఏడ్చేస్తోంది!
close
Published : 15/12/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఏంటమ్మా’ అనడిగితే ఏడ్చేస్తోంది!

మా అమ్మకు 65 ఏళ్లు. ఈ మధ్య గట్టిగట్టిగా మాట్లాడుతుంది. కోపం కూడా ఎక్కువైంది. ‘ఎందుకిలా మాట్లాడుతున్నావమ్మా’ అని అడిగితే ‘నేనేం చేశా’నని ఏడుస్తోంది. కాసేపటికి మళ్లీ మామూలుగా అయిపోతుంది. తనకు బీపీ    తప్ప మిగతా ఆరోగ్య సమస్యలేవీ లేవు. తను ఎందుకలా ప్రవర్తిస్తుంది?

- భాగ్యం, హైదరాబాద్‌

ఈ వయసు స్త్రీలలో శారీరకంగా, మానసికంగా చాలా మార్పులొస్తాయి. ముఖ్యంగా హార్మోన్లు బాగా తగ్గిపోతాయి. మెదడులోని రసాయనాల్లో చాలా రకాల మార్పులు సంభవిస్తాయి. దీంతో వారి ప్రవర్తనా, ఉద్వేగాల్లోనూ చాలా తేడాలొస్తాయి. కోపం, చిరాకు, విసుగు లాంటివి ఎక్కువవుతాయి. మీ అమ్మగారి సమస్యకు ఇదొక కారణం కావొచ్చు. అలాగే ఈ వయసు మహిళల్లో చాలామంది కుంగుబాటుకు గురవుతారు. దీనికి తోడు వృద్ధాప్యంలో వచ్చే మధుమేహం, రక్తపోటు, కీళ్లనొప్పులు... ఇలా శారీరక, ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. వీటిని తట్టుకోలేక వారికి తెలియకుండానే ఒత్తిడికి గురవుతారు. ఇదిలాగే కొనసాగితే డిప్రెషన్‌కూ దారి తీయొచ్చు. ఈ వయసులో చాలామంది తాము జీవిత చరమాంకంలో ఉన్నామని భావిస్తుంటారు.  ‘నన్నెవరూ పట్టించుకోవడం లేదు, నాతో ఎవరూ సరిగా ఉండటం లేదు’ అనే ఆలోచనలతో పదేపదే బాధపడుతుంటారు. 65 ఏళ్లు, ఆపైన వయసు వచ్చిన కొందరిలో మతిమరపుతోపాటు బుద్ధిమాంద్యం కూడా రావడానికి అవకాశాలున్నాయి. ‘డిమెన్షియా’ వచ్చే ముందు కూడా వారి ప్రవర్తన ఇలానే ఉండొచ్చు. పైన చెప్పిన ఏదైనా కారణంతో మీ అమ్మగారు బాధపడుతూ ఉండొచ్చు. ఆమెకు మధుమేహం, మతిమరపు, పక్షవాతం లాంటి ఏ సమస్యలూ లేకపోయినా డిప్రెషన్‌ ఉందేమో తెలుసుకోవాలి. మీ అమ్మగారిని ఓసారి మానసిక వైద్య నిపుణులకు చూపించండి. వారు తగిన పరీక్షలు చేసి మందులు, చికిత్సలు సూచిస్తారు. వీటితోపాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్‌ ఇస్తారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని