ఫోన్‌ వదిలేసి ఇవి ఆడేస్తారు!
close
Published : 16/12/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫోన్‌ వదిలేసి ఇవి ఆడేస్తారు!

పిల్లలను ఆడించడానికి, చదివించడానికి, చివరకు అన్నం తినిపించడానికి... ఇలా ప్రతి అవసరానికీ సెల్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌నే ఉపయోగిస్తున్నాం. ఈ కారణంగా వారికి మానసికంగా, శారీరకంగా సమస్యలు వస్తున్నాయి. దీనికి ఓ భిన్నమైన పరిష్కారాన్ని ఆలోచించిందో తల్లి. పిల్లలను ఆకట్టుకునేలా పజిల్‌ కార్డ్స్‌, కార్డ్‌ గేమ్స్‌... తయారుచేశారు బెంగళూరుకి చెందిన 34 ఏళ్ల లావినా తౌర్‌ సౌజా.

‘సాంకేతికత వృద్ధిని స్వాగతించాలి, కానీ దానివల్ల పిల్లల ఆరోగ్యానికీ, మానసిక వికాసానికీ హాని జరుగుతుందంటే ఆలోచించాల్సిందే. నేను ఇద్దరు పిల్లల తల్లిని. పిల్లలకు ఫోన్‌ కంటే కూడా ఆకట్టుకునేలా ఏదైనా చేయాలనిపించింది. ముఖ్యంగా రెండు నుంచి అయిదేళ్ల మధ్య వయసున్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్నా. చదువుకు ఆటను జోడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించి ఫ్లాష్‌ కార్డ్స్‌, కట్టింగ్‌ స్ట్రిప్స్‌, మెమరీ కార్డ్స్‌, నంబర్‌ మ్యాచింగ్‌, పజిల్‌ కార్డ్స్‌ రూపొందించా’ అని చెబుతారు లావినా.  వీటిని విక్రయించడం కోసం ‘ది లిటిల్‌ ఫిలోమ్యాథ్‌’ అనే సంస్థని మొదలుపెట్టారామె. ఒకేలాంటి ఆకారాల్ని జత చేయడం, రంగుల్ని పోల్చడం, జంతువులు, శరీర భాగాలు, అంకెల్ని గుర్తించడం వంటివి ఉంటాయి. వీటిని ఆడుతూనే నేర్చుకోవచ్చు. వీటి ద్వారా పిల్లల్లో ఆలోచనాశక్తితోపాటు సృజనాత్మకత, పనిమీద ఆసక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. వారి శారీరక, మానసిక ఆరోగ్యమూ మెరుగుపడుతుంది. ఇవి తల్లిదండ్రులే దగ్గరుండి పిల్లలతో చేయించాలి కాబట్టి చిన్నారులతో వారి బంధం బలపడుతుంది కూడా. వీటితో విద్య కూడా వినోదం అయిపోయింది. ‘లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలు ఫోన్లకు అతుక్కుపోవడం చూసి ఈ ఆలోచన వచ్చింది. జులైలోనే ఉత్పత్తుల్ని మార్కెట్‌లోకి తెచ్చా. మా ఉత్పత్తుల్ని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అమ్మకానికి పెడుతున్నా. ఇంటిపట్టునే ఉంటూనే ఇది చేస్తున్నా’ అని అంటున్నారు లావినా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని