ఇవీ గుండెజబ్బు సూచికలే!
close
Published : 22/12/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇవీ గుండెజబ్బు సూచికలే!

చేతి, కాలి వేలి గోళ్ల దిగువన లేదూ చర్మం మీద ఎక్కడైనా పసుపు, నారింజ మిశ్రమ రంగులో దద్దులాంటిది వస్తోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. దీన్ని చాలామంది చర్మ సమస్యనే అనుకుంటారు గానీ ఇవి గుండెజబ్బుకు సంకేతం కావొచ్చు. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు బాగా పెరిగిపోతే ఇలా చర్మం మీద చిన్న చిన్న పొక్కులు, గుల్లల వంటివి బయలుదేరతాయి. ట్రైగ్లిజరైడ్లు గుండె ఆరోగ్యానికి చేటు తెచ్చిపెడతాయి. వీటి స్థాయులు శ్రుతిమించితే రక్తనాళాలు గట్టిపడే ప్రమాదముంది. అంతేకాదు, పిడికిలి బిగువు తగ్గటమూ గుండెజబ్బు ముప్పును సూచించేదే. దెబ్బల వంటివేవీ తగలకపోయినా అకారణంగా గోళ్ల కింద చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడటమూ ప్రమాదకరమైనదే. ఇవి గుండె కవాట పొర ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం కావొచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని