క్యాన్సర్‌ బాధిత చిన్నారుల కోసం సాహసాల రెజీనా!
close
Published : 22/12/2020 01:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్యాన్సర్‌ బాధిత చిన్నారుల కోసం సాహసాల రెజీనా!

ఓవైపు గడ్డకట్టించే చలి... ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆ ఎత్తైన కొండలమీద నుంచి జారిపడి గాయాలపాలవ్వడం ఖాయం! అయినాసరే ఆ కఠినమైన హిమాలయ పర్వత శ్రేణుల్లోనే  సాహసం చేసింది నటి రెజీనా కసాండ్రా. కారణం... ఆ సాహసం క్యాన్సర్‌ బాధిత చిన్నారులను సాయపడుతుంది కాబట్టి. 

క్యాన్సర్‌ బాధిత చిన్నారులను ఆదుకోవడం కోసం ‘వైల్డ్‌ వారియర్‌ హిమాలయన్‌ అడ్వెంచర్‌ ఛాలెంజ్‌- 2020’లో పాల్గొన్న రెజీనా ఈ పోటీల్లో విజేతగా నిలవడం విశేషం. 30కి.మీ. రన్నింగ్‌, రాఫ్టింగ్‌ పోటీల్లో పాల్గొన్న రెజీనా ఇందుకోసం చాలా కష్టపడిందట. ‘ఆఖరి కిలోమీటర్‌ని పూర్తిచేసే దశలో రేపులేదు అన్నట్టుగా పరుగుపెట్టా. నిజానికి అప్పటికే నా బ్యాటరీ అయిపోయింది. కానీ నా కళ్లముందు క్యాన్సర్‌ పిల్లలకు సాయం చేయాలన్న నా ఆశయమే కనిపించింది. అదే నన్ను విజేతని చేసిందనే’ రెజీనా...  ఈ పోటీల కోసం కొన్నిరోజుల ముందు నుంచే  స్వీట్లు, జంక్‌ఫుడ్‌కి పూర్తిగా దూరమయ్యిందట. తక్షణ శక్తికోసం ఖర్జూరాలని మాత్రమే తినేదట. 45 నిమిషాలపాటూ హిల్‌రన్నింగ్‌, బీచ్‌రన్నింగ్‌ వంటివి చేయాలంటే చాలా ఓపిక కావాలి.  ఇందుకోసం   వారంలో నాలుగుసార్లు 30 అంతస్తుల మెట్లని ఎక్కిదిగేదాన్ని... అంటూ చెప్పుకొచ్చింది రెజీనా.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని