క్రిస్మస్‌ కళ.. తీసుకొద్దామిలా..!
close
Updated : 23/12/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రిస్మస్‌ కళ.. తీసుకొద్దామిలా..!

చూడండి.. చెయ్యండి!

పిల్లలూ.. క్రిస్మస్‌ వచ్చేస్తోంది. ఈ సమయంలో స్టార్లు, వివిధ అలంకరణ సామగ్రితో ఇంటిని అందంగా ముస్తాబు చేసుకుంటారు కదా! క్రిస్మస్‌ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది గ్రీటింగ్‌ కార్డులు, ట్రీ. బయట దుకాణాల్లో బోలెడు వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. డబ్బులు పెట్టి వాటిని కొనే అవసరం లేకుండా చిన్న చిన్న వస్తువులతో మనమే సొంతంగా క్రిస్మస్‌ ట్రీలను తయారు చేసుకుందాం.

కావాల్సిన వస్తువులు
1. ఐస్‌ పుల్లలు  2. మార్కర్‌ పెన్నులు
4. థర్మోకాల్‌ బాల్స్‌, నక్షత్రాలు

ముందుగా కొన్ని గట్టిగా ఉండే ఐస్‌ పుల్లలను తీసుకోవాలి. ఏదైనా ఒక మార్కర్‌తో ఒక పెద్ద పుల్లకు రంగు వేయండి. మరికొన్ని పుల్లలు తీసుకొని ఆరోహణ (అసెండింగ్‌) క్రమంలో ఫొటోలో చూపించినట్లు కత్తిరించుకోవాలి. వీటికి కూడా మరో మార్కర్‌తో రంగు వేసి ఇంతకుముందు సిద్ధం చేసుకున్న పెద్ద పుల్లకు అడ్డంగా అతికించాలి. ఇప్పుడు ఒక చిన్న తాడు ముక్క తీసుకొని స్టార్‌తో కలిపి పెద్ద పుల్లపై చివర అతికించాలి. చిన్న పుల్లల పైభాగంలో థర్మోకాల్‌ బాల్స్‌ కానీ వేరే మెరుపుల అలంకరణ స్టిక్లర్లు కానీ అతికించుకుంటే క్రిస్మస్‌ ట్రీ సిద్ధమైనట్లే. ఇలా ఎన్ని కావాలంటే అన్ని.. వివిధ రంగుల్లో తయారు చేసుకొని పెద్దవాళ్ల సహాయంతో ఇంట్లో అలంకరించుకోవడమే. సింపుల్‌గా, చూడముచ్చటగా ఉంది కదూ..! ఇంకెందుకు ఆలస్యం? మీరూ ఒకసారి ప్రయత్నించండి. క్రాఫ్ట్‌ తయారు చేసిన తర్వాత సెల్ఫీ దిగి స్నేహితులు, బంధువులతో పంచుకోండి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని