పదేపదే వద్దనకండి..!
close
Published : 04/01/2021 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పదేపదే వద్దనకండి..!

తమ చిన్నారులను చక్కని క్రమశిక్షణతో పెంచాలని తల్లిదండ్రులందరూ ఆశపడతారు. కానీ బుజ్జాయిలను ఎలా దారిలో పెట్టాలన్నదే పెద్ద సమస్య. అందుకోసం ఇలా ప్రయత్నించి చూడండి.

మీకెన్ని పనులున్నా.. చిన్నారుల కోసం  కొంత సమయాన్ని కేటాయించాలి.
తల్లిదండ్రులు  ‘ఇలా చేయొద్దు... అలా చేయొద్దు’ అని చెబుతుంటారు. దీంతో ‘వద్దు’ అన్న పదమే పిల్లలకు బాగా గుర్తుండిపోతుంది. ఈ పదాన్ని పిల్లల ముందు వాడకపోవడమే మంచిది.
కొంతమంది పిల్లలు తమ ఆట వస్తువులను ఇతరులు తీసుకుంటే ఏడుపు మొదలుపెడతారు. అందుకే ముందుగా ఆ వస్తువులను మీరు తీసుకుని వాళ్లతో ఆడటం మొదలుపెట్టాలి.దీనివల్ల పంచుకోవడం పిల్లలకు అలవాటవుతుంది.
పిల్లలెప్పుడూ పెద్దవాళ్లను చూసే నేర్చుకుంటారు. మీరు ఇతరుల మీద అరవడం, కోప్పడటం చేస్తే రేపు వాళ్లూ అదే చేస్తారు. క్రమశిక్షణ పేరుతో చిన్నారుల మీద అరవకుండా చక్కని వాతావరణంలో వాళ్లను పెంచాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని