రద్దయిన పథకాలకు జీవం..
close
Published : 08/01/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రద్దయిన పథకాలకు జీవం..

ఎల్‌ఐసీ

రోనా వైరస్‌ నేపథ్యంలో చాలామంది పాలసీదారులు ప్రీమియం చెల్లించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో వారి పాలసీలు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాలసీదారులకు ఇబ్బంది కలగకుండా భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రద్దయిన పాలసీలను పునరుద్ధరించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. కొన్ని నిబంధనలకు లోబడి, రద్దయిన పాలసీలను తిరిగి వెలుగులోకి తెచ్చేందుకు మార్చి 6 వరకూ వెసులుబాటునిచ్చింది. ఇందుకోసం ఎలాంటి ఆరోగ్య పరీక్షలూ అవసరం ఉండదు. చివరి ప్రీమియం చెల్లించి, ఐదేళ్లు పూర్తి కాకపోతే.. వాటికి ఇప్పుడు ప్రీమియం చెల్లించవచ్చని ఎల్‌ఐసీ తెలిపింది. చాలా పాలసీలకు ఆరోగ్య పరీక్షలు అవసరం లేదని, కాకపోతే.. ఆరోగ్యంగా ఉన్నామని, కొవిడ్‌-19కు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ పాలసీదారుడు ఒక ధ్రువీకరణ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. ప్రీమియం ఆలస్యంగా చెల్లించినందుకు గాను.. విధించే అపరాధ రుసుములోనూ 20శాతం లేదా గరిష్ఠంగా రూ.2వేల వరకూ రాయితీని ఇస్తుంది. రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకూ వార్షిక ప్రీమియం చెల్లించే వారికి ఇది 25శాతంగా నిర్ణయించింది. పాలసీల వ్యవధి ముగిసిన వాటికి ఇది వర్తించదు. అనుకోని పరిస్థితుల్లో ప్రీమియం చెల్లించకుండా.. పాలసీని రద్దయిన వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఎల్‌ఐసీ ప్రకటించింది. పాత పాలసీలను పునరుద్ధరించుకోవడం ఎప్పుడూ మంచిదేనని, పాలసీదారుల ప్రయోజనాన్ని కాపాడేందుకు ఇది తోడ్పడుతుందని వెల్లడించింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని