గర్వపడండి...గరిమను చూసి!
close
Published : 16/01/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గర్వపడండి...గరిమను చూసి!

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌  బృందంలో ఇప్పటికే కీలకపదవులు అందుకున్న భారతీయుల సరసన  గరిమా వర్మ చేరారు. ప్రథమ మహిళ జిల్‌ బృందంలో డిజిటల్‌ డైరెక్టర్‌గా కీలక స్థానం అందుకున్నారు.

‘ప్రతి ఉత్పత్తికి, ప్రతి చిత్రానికీ ఓ కథ ఉంటుంది. అది బోలెడంత బాధ్యతనూ, మోయలేనంత బరువునీ కలిగి ఉంటుంది. ఆ కథనే వినియోగదారుడికి అందంగా చెప్పగలగాలి. వారితో అనుబంధాన్ని పెంచుకోవాలి. స్ఫూర్తిని నింపాలి. సానుకూలతనూ, ఆహ్లాదాన్ని పంచాలి. అప్పుడే ప్రత్యేకమైన గుర్తింపు సాధ్యమవుతుంది’ అంటారు గరిమా వర్మ.

గరిమ తల్లిదండ్రులు భారతీయులు. ఇండియాలోనే పుట్టిపెరిగిన ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం ఆమెరికా వలస వెళ్లారు. ‘బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో చంటిపిల్లనైన నన్ను చంకనేసుకుని నా తల్లిదండ్రులు దేశాలు దాటి వచ్చారు. వారికి నేనేం చేయగలను. వారిని గర్వపడేలా చేయడం తప్ప. ఇది వలస కుటుంబాల వారందరి గెలుపు’ అంటారామె. ఓహియో, సెంట్రల్‌ వ్యాలీ ఆఫ్‌ క్యాలిఫోర్నియాలో పెరిగిన గరిమ కెరీర్‌గా డిజిటల్‌ మార్కెటింగ్‌, స్ట్రాటజీలను ఎంచుకున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు ..వాల్ట్‌డిస్నీకి చెందిన ఏబీసీ నెట్‌వర్క్‌లో హోస్ట్‌గా పనిచేశారు. పారామౌంట్‌ పిక్చర్స్‌లో గ్రాఫిక్‌ డిజైన్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించారు. బైడెన్‌-కమలా హారిస్‌ ఎన్నికల ప్రచారంలో డిజిటల్‌ మీడియా వ్యూహకర్తగా ఆమె బైడెన్‌ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. తాజా అధ్యక్ష ఎన్నికల్లో సామాజిక మాధ్యమాలు కీలకపాత్ర పోషించాయి. గెలుపోటములను చాలావరకూ ప్రభావితం చేశాయి. అంతటి ప్రాధాన్యం ఉన్న సమయంలో జోబైడెన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నిర్వహణ తీసుకున్నారు గరిమ. దానికి అవసరమైన క్రియేటివ్‌ కంటెంట్‌ని ఎప్పటి   కప్పుడు అందించడంతో పాటు ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడుతూ అన్ని వర్గాలూ చేరువ అవ్వడానికి ఆమె ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దాని ఫలితంగానే ఆమె బాధ్యతలు తీసుకోవడానికి ముందు బైడెన్‌ ఖాతాను అనుసరించేవారు 2.9 మిలియన్‌ మంది కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 13.9 మిలియన్లు కావడం విశేషం. ఆ పనితీరే అమెరికా ప్రథమ మహిళ జిల్‌బైడెన్‌ బృందంలో కీలకస్థానం తెచ్చిపెట్టింది. డిజిటల్‌ డైరెక్టర్‌గా ఎంపికయ్యేలా చేసింది. ‘ఏడాది కాలంగా చేసిన పనికి గుర్తింపు...దీన్ని గౌరవంగా భావిస్తా. కొత్త బాధ్యతలు తీసుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. మంచి భవిష్యత్తుపై ఆశతో పోరాడాం’ అంటారామె.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని