అందం పెంచుకోండిలా!
close
Published : 19/01/2021 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందం పెంచుకోండిలా!

అతివలకు ఇష్టమైన వాటిలో అద్దం ముందుంటుంది. దాన్ని ముందు కూర్చొంటే కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటారు. అందానికి మెరుగులు దిద్దుకుంటూ మరింతగా మెరిసిపోవాలనుకుంటారు. అలాంటి అందమైన మగువల కోసం మరిన్ని సౌందర్య చిట్కాలు...

చేతులు కోమలంగా.. మనలో చాలామంది చేతులను అంతగా పట్టించుకోం. అయితే వయసును తెలియజేయడంలో ఇవి ముందుంటాయి. సరైన పోషణ లేకపోవడంతో పొడిబారి, ముడతలుపడి ఉన్న వయసుకంటే పెద్దవారిలా కనిపించేలా చేస్తాయి. కాబట్టి వీటి పోషణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ మానిక్యూర్‌ చేయించుకోవాలి.
కనుబొమలు కుదురుగా.. వీటికి సరైన ఆకృతి రావాలంటే ప్రొఫెనల్స్‌ను కలవాల్సిందే. వారే మీ ముఖానికి నప్పేలా వాటిని తీర్చిదిద్దుతారు.
స్మార్ట్‌గా షాపింగ్‌.. స్నేహితురాలు చెప్పిందనో, సహోద్యోగురాలికి నచ్చిందనో వారు వాడే సౌందర్య ఉత్పత్తులనే మీరూ కొనొద్దు. మీ చర్మ తత్త్వానికి సరిపోయే వాటిని మాత్రమే ఎంచుకోవాలి.

లేత రంగు ఫౌండేషన్‌... మీ వయసు కంటే తక్కువగా కనిపించాలనుకుంటున్నారా.... ఫౌండేషన్‌ను కొనేటప్పుడు లేత లేదా మధ్యస్థంగా ఉండే షేడ్‌ను ఎంచుకుంటే సరి.
బ్లష్‌ తప్పనిసరి... మీ మోము చక్కగా మెరిసిపోవాలంటే... క్రీమ్‌ బ్లష్‌ను వాడాల్సిందే. ఇది మోమును మెరిపిస్తుంది.
గులాబీ నీరు కావాల్సిందే... ఈ నీరు ముఖాన్ని తాజాగా మారుస్తుంది. ఈ నీటితో రోజూ ముఖాన్ని తుడుచుకుంటే మోము మెరుస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని