చిన్నితల్లి జాగ్రత్త! 
close
Published : 30/01/2021 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నితల్లి జాగ్రత్త! 

పసిపిల్లలకు చాక్లెట్‌ ఇస్తే ముద్దు పెడతారు... ముద్దు చేస్తే...ఆప్యాయంగా అల్లుకుపోతారు. అన్న, అంకుల్‌, తాతయ్య...అంటూ అందరికీ వరుసలు కలిపి...అనుబంధాల్ని పంచేసుకుంటారు. అయితే వారికి తెలియదు కదా!...ఆ బంధాల చాటున బుసలు కొట్టే పాములుంటాయనీ, కామంతో ఒంటిని తడిమేసే కర్కశులూ ఉంటారని. ఈ వైపరీత్యాలను అడ్డుకోవాలంటే...తల్లిగా మీరు నిత్యం అప్రమత్తంగా ఉండాలి.  అప్పుడే మీ కనుపాపల్ని కాపాడుకోగలరు అని చెబుతున్నారు బాలలహక్కులు-రక్షణపై పనిచేస్తోన్న డా. మమతా రఘువీర్‌.


* పద్దెనిమిదేళ్లలోపు పిల్లలపైజరిగే లైంగిక వేధింపులను నిరోధించడానికి 2012లో వచ్చింది పోక్సో చట్టం.
జువైనల్‌ జస్టిస్‌ యాక్ట్‌-2015 పిల్లలపై శారీరక, మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షల్ని సూచిస్తుంది.
లైంగిక వేధింపులకు గురైన చిన్నారులూ వారి కుటుంబ సభ్యులు సాయం కోరుతూ 100(పోలీసు), 1098(చైల్డ్‌హెల్ప్‌లైన్‌)లకు ఫోన్‌ చేయొచ్చు.
ఫిర్యాదు చేసేవారి గోప్యతని కాపాడటం కోసంజాతీయ బాలల హక్కుల కమిషన్‌ తమ వెబ్‌సైట్‌లో ఈ-బాక్స్‌నిఏర్పాటు చేసింది.
2019 జాతీయ నేరపరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం బాలలపై లైంగిక వేధింపులు గతం కంటే 4.5 శాతం పెరిగాయి.
2020 మార్చి నుంచి సెప్టెంబర్‌ వరకూ జాతీయ బాలల హక్కుల కమిషన్‌కు వచ్చిన ఫిర్యాదులు 420.
2020లో చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌కి బాలల వేధింపులపై వచ్చిన  ఫోన్‌కాల్స్‌ 3,941.


దురింటి అంకుల్‌ పేరెత్తినా చాలు పదేళ్ల తన్వి భయపడిపోతుంది. అమ్మా నన్ను వదిలి వెళ్లొద్దమా! అని పాప అంటుంటే ఆ తల్లి బిడ్డకు తనపై ఉన్న ప్రేమనుకుని మురిసిపోయింది. ‘నాన్నా తలుపులు తెరవొద్దు’ అని పదే పదే చెబుతోంటే...ఇంటి బాధ్యతల్ని ఒంటపట్టించుకుంటోందనుకుని మురిసిపోయాడా తండ్రి. కానీ కూతురి మాటల వెనక ఉన్న అంతులేని బాధని వారు అంత త్వరగా అర్థం చేసుకోలేకపోయారు. క్రమంగా తన్వి చదువుల్లో వెనకబడింది. ముభావంగానూ ఉంటోంది. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి పాఠశాలకు వెళ్లారిద్దరూ... అక్కడ టీచర్లు చెప్పిందీ ఇదే విషయం. వైద్యురాలి దగ్గరికి తీసుకెళ్తే పాప శారీరకంగా ఆరోగ్యంగానే ఉంది...ఓసారి సైక్రియాట్రిస్ట్‌కి చూపించమని సలహా ఇచ్చారు. ‘ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటోన్న పాపకు మానసిక సమస్య ఎందుకొస్తుంది’ అనుకుంటూనే తీసుకెళ్లారు. అక్కడే వారికి ఓ చేదు నిజం తెలిసింది. తమ బిడ్డ ఓ రాక్షసుడి మృగత్వానికి కుంగిపోయిందని...కానీ వారు నమ్మలేకపోయారు. నిఘాపెట్టారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పాపను మామూలు మనిషిని చేయడానికి వాళ్లకు ఏళ్ల సమయం పట్టింది. కానీ అందరి విషయంలోనూ ఇలా జరగడం లేదు. ఎంతోమంది పసిపిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.
చెప్పే స్వేచ్ఛనివ్వండి...
పసిపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని సులువుగా గుర్తించేయొచ్చు అనుకుంటే పొరబాటే. మంచి అనే ముసుగు వేసుకుని, బంధాలు కలుపుకునే మానవరూప రాక్షసుల్ని అంత సులువుగా గుర్తించలేం. ఎందుకంటే వారు మీ ఇంట్లోనో, స్కూల్లోనో, పక్కింట్లోనో ఎక్కడైనా ఉండొచ్చు. అది మనలోనే ఎవరైనా ఇలా కావొచ్చు. అందుకే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తల్లిదండ్రులు ఓ పట్టాన వాస్తవాన్ని అంగీకరించలేరు. మీరు మాత్రం అలా చేయొద్దు. పిల్లలు ఎవరినైతే ప్రతిఘటిస్తున్నారో వారి విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు.
మీరేం చేయాలి?
లైంగిక వేధింపులు ఏ రూపంలో ఉంటాయో ముందు మీరు అర్థం చేసుకుని వాటిని పిల్లలు సులువుగా తెలుసుకునేలా చెప్పండి. ముఖ్యంగా వ్యక్తిగత శరీర భాగాలపై చేతులు వేయడం, లైంగిక చర్యకు ప్రేరేపించడం, ముద్దు పెట్టుకోవడం, నగ్నచిత్రాలనూ, వీడియోలనూ చూపించడం, అలా చేయమని ఒత్తిడి చేయడం, వారి రహస్యభాగాలను తాకమనడం వంటివన్నీ ఈ తరహానే.
చిన్నారులకు ఊహ తెలిసినప్పటి నుంచే వారికి మంచీ, చెడు స్పర్శలకు తేడా ఏంటో అర్థం అయ్యేలా చెప్పండి.  ఎప్పుడైనా అసౌకర్యం ఎదురైతే ప్రతిఘటించాల్సిన అవసరాన్ని, తల్లిదండ్రులకు చెప్పాల్సిన ఆవశ్యకతను చెప్పండి.  దీనివల్ల ఆపదను ముందుగానే పసిగట్టి తప్పించుకోగలరు.
* పిల్లల్ని అప్రమత్తంగా ఉంచడం ఎంత అవసరమో! ఒకవేళ అలాంటి ఘటనలో బాధితులుగా మారితే మానసికంగా వారికి తోడుగా నిలబడటమూ అంతే ముఖ్యం. అందుకే వారికెదురైన సమస్యను మనసు విప్పి చెప్పుకునే స్వేచ్ఛను మీరివ్వాలి. అలా చెప్పలేకపోతే ఓ చీటీ రాసి కన్ఫెషన్‌ బాక్సులో వేయమనండి.  వాస్తవానికి అలాంటి ఏర్పాటు ఒకటి చిన్నప్పటి నుంచే వారికి అలవాటు చేయాలి. అలాగని అన్నీ తెలుసుకుని మీరు వారిని నిందించడం, తిట్టడం, కొట్టడం వంటివి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా...వారు కుంగిపోయే ప్రమాదం ఉంది.

- డా.మమతా రఘువీర్‌, తరుణి స్వచ్ఛంద సంస్థమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని