...ఆడుకోరా తమ్ముడా!
close
Updated : 31/01/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

...ఆడుకోరా తమ్ముడా!

ఊయ్యాలలెక్కి ఊగాలని, జారుడుబల్లపై ఆడుకోవాలని ఏ పిల్లలకి మాత్రం ఉండదు.. సాధారణ పిల్లలకైతే ఇవన్నీ మామూలు విషయాలే! కానీ ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు మాత్రం ఈ కల నెరవేరడం కష్టమే. వారికోసమే ‘గుడ్‌గుడీ’ పేరుతో ప్రత్యేకంగా క్రీడా మైదానాలని డిజైన్‌ చేస్తున్నారు అదితి అగర్వాల్‌, అంజలీమేనన్‌లు. వీరు ఫోర్బ్స్‌లో స్థానం దక్కించుకున్నారు.
అహ్మదాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైనింగ్‌లో చదువుకుంటున్నప్పుడు అదితి అగర్వాల్‌, అంజలీమేనన్‌లు ఓ ప్రాజెక్టు పనిలో భాగంగా బ్లైండ్‌ పీపుల్‌ అసోసియేషన్‌(బీపీఏ) అనే సంస్థకి వెళ్లారు. అక్కడ అంధులైన పిల్లలకే కాకుండా ఇతర ప్రత్యేక అవసరాలున్న పిల్లలకి కూడా శిక్షణ ఇస్తుంటారు. అలాంటి చోట...ఆ పిల్లలకు ఆడుకోవడానికి వీలుగా ఆటస్థలం లేకపోవడం అదితి, అంజలీలను ఆలోచింపజేేసింది. ఆరా తీస్తే.. అక్కడనే కాదు పబ్లిక్‌ పార్కులు, అపార్ట్‌మెంట్లూ.. ఇలా ఎక్కడ చూసినా ప్రత్యేకమైన పిల్లలు ఆడుకోవడానికి ఒక్క ఆటవస్తువూ లేదు. ఇవన్నీ చూసిన తర్వాత బీపీఏలో అంధులు, ఆటిజం సహా ఇతర అవసరాలున్న పిల్లల కోసం ఓ ఆటస్థలాన్ని రూపొందించారు. వాళ్ల మొదటి డిజైన్‌కే ప్రతిష్ఠాత్మక ఐఎఫ్‌ కాన్సెప్ట్‌ డిజైన్‌ అవార్డుని అందుకున్నారు. దాంతో వాళ్లకి తమ ప్రయత్నంపై నమ్మకం కుదిరింది. ఆ తర్వాత ‘గుడ్‌గుడీ’ అనే ఒక సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లలకోసం ఆట ఫర్నిచర్‌ని రూపొందించడం మొదలుపెట్టారు. వీటిని అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు, స్కూళ్లలో అమర్చడం మొదలుపెట్టారు. ప్లాస్టిక్‌, మెటల్‌ వంటి వాటి స్థానంలో... అంధులైన పిల్లలు ఆడుకోవడానికి బెల్స్‌, సెన్సార్లు అమర్చారు. యాభైకి పైగా క్రీడా ఫర్నిచర్‌ని డిజైన్‌ చేశారు. ఎన్జీవోలు, బిల్డర్స్‌తో కలిసి పనిచేస్తూ బెంగళూరు,ముంబయి వంటి చోట్ల ప్రస్తుతం ఈ ప్రత్యేక క్రీడామైదానాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఆలోచనకిగానూ ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30లో స్థానం దక్కించుకున్నారు వీళ్లు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని