ఆమె ప్రవర్తన ఎందుకలా?
close
Updated : 06/02/2021 02:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె ప్రవర్తన ఎందుకలా?

మా వదినకు నలభై ఆరేళ్లు. తనకు ఇద్దరు పిల్లలు. ఆమెకు భక్తి ఎక్కువ. దయ్యాలూ, భూతాలున్నాయనీ నమ్ముతుంది. ఇంతకుముందు తనకు జబ్బు చేసి కొన్నాళ్లపాటు మందులు వాడింది. తిరిగి మాములుగా మారింది. ఆ అనారోగ్యం కారణంగా తరచూ కొంచెం నీరసంగా ఉంటోంది. ఇప్పుడు తనకు ఏవో కనిపిస్తున్నాయనీ, అవి తనని భయపెడుతున్నాయనీ అంటోంది. శాంతి చేయించాలని చెబుతోంది. ఆస్పత్రికి వెళ్దామంటే దెయ్యం పట్టినవాళ్లకి మందులు పనిచేయవని చెబుతోంది. అసలు తనది మానసిక సమస్యా? శారీరక సమస్యా?

- ఓ సోదరి

కుటుంబంలో ఇంతకుముందు ఎవరికైనా జన్యుపరంగా మానసిక సమస్యలు ఉన్నట్లయితే... కుటుంబంలో 30 ఏళ్లు దాటిన కొందరు వ్యక్తులకు ఇది వచ్చే అవకాశం ఉంది. తీవ్రమైన జ్వరమో లేదా మరేదైనా అనారోగ్యమో సంభవించినప్పుడు లేదా అధికంగా ఒత్తిడికి లోనైనప్పుడు మెల్లిగా ఈ మానసిక వ్యాధులు బయటపడతాయి. మీ మాటలను బట్టి చూస్తే ఆమె తీవ్రమైన మానసిక వ్యాధికి గురైనట్లు అనిపిస్తోంది. దీన్ని వైద్యపరిభాషలో ‘స్కిజోఫ్రెనియా’ అంటారు. మన సమాజంలో నేటికీ కొన్నిచోట్ల దయ్యాలు, భూతాలున్నాయని గుడ్డిగా నమ్ముతున్నారు. వీటిని పోగొట్టాలంటే పూజలు, శాంతులు చేయించాలని మూఢంగా విశ్వసిస్తున్నారు. అయితే వీటివల్ల ఎలాంటి అనారోగ్యం తగ్గదు సరికదా చికిత్స తీసుకోవడం ఆలస్యమైతే సమస్య మరింత ముదిరే ప్రమాదముంది. సమయం వృథా చేస్తే జబ్బు పెరిగి భ్రమలు, భ్రాంతులు మరింత ఎక్కువవుతాయి. ఆమె ఎవరి మాట అయితే వింటుందో వారితో చెప్పించి మానసిక నిపుణుల వద్దకు తీసుకువెళ్లండి. మందులు, చికిత్స తీసుకుంటూ ఉంటే తప్పనిసరిగా తనలో మార్పు వస్తుంది. ఆమె కొంచెం కోలుకున్నాక... తన అనారోగ్యానికి కారణం మంత్రాలే అనే అపోహను పోగొట్టి, అది మానసిక సమస్య అని తెలియజేయాలి. లేదంటే ఆమెతోపాటు, చుట్టుపక్కలవాళ్లూ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని