మీ పని తేలిక చేస్తుంది!  
close
Updated : 19/02/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీ పని తేలిక చేస్తుంది!  

మేకప్‌లో భాగంగా వేసుకునే ఫౌండేషన్‌ని ముఖంపై సమంగా పరుచుకునేలా చేేయడం అంత సులభం కాదు. అదే మీ చేతిలో ఈ మేకప్‌ బ్లెండర్‌ ఉంటే ఆ పని చిటికెలో అయిపోతుంది..
చూడ్డానికి నీటిచుక్క ఆకారంలో ఉండే బ్లెండర్‌ని మీ మేకప్‌ కిట్‌లో పెట్టుకుంటే క్షణాల్లో మీ మేకప్‌ పని పూర్తవుతుంది. అయితే దీన్నిఉపయోగించడం కూడా మీకు తెలియాలి. బ్లెండర్‌ని పొడిగా వాడకూడదు. దీన్ని నీటిలో ముంచి గట్టిగా పిండేయాలి. తడిగా ఉండే ఆ బ్లెండర్‌తో ఫౌండేషన్‌, కన్సీలర్‌ వంటివి వేసుకోవడం చాలా సులభం. ఫౌండేషన్‌ని ముఖంపై చిన్నచిన్న చుక్కలుగా పెట్టుకున్న తర్వాత బ్లెండర్‌ని పైపైన అద్దితే చాలు. అది సమానంగా పరుచుకుంటుంది. ప్యాచులుగా కనిపించకుండా సహజంగా కనిపిస్తుంది. బ్లెండర్‌ ఒకవైపు కొనదేలి ఉంటుంది. మరోవైపు గుండ్రంగా ఉంటుంది. కళ్ల కింద కన్సీలర్‌ వేసుకోవాలనుకున్నప్పుడు కొనతేలినవైపు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మీ మేకప్‌ వేసుకోవడం పూర్తయిన తర్వాత ఆ   బ్లెండర్‌ని నీటితో కడిగేయడం మాత్రం మర్చిపోవద్దు సుమీ!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని