23 లక్షల మంది చూశారు!
close
Published : 27/02/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

23 లక్షల మంది చూశారు!

మనదేశంలో ప్రతి ఆరుగురు మహిళల్లో ఒకరు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. సంతానం లేనంత మాత్రాన ఆ స్త్రీకి సంపూర్ణత్వం సిద్ధించదా? నిత్యజీవితంలో ఎన్నో పాత్రల్ని సమర్థంగా పోషించే మహిళ కేవలం పిల్లలు పుట్టలేదన్న ఒకే ఒక్క కారణంతో అసంపూర్ణంగా ఎలా మిగిలిపోతుంది? ... అంటూ ప్రముఖ సంస్థ రూపొందించిన ప్రకటన ఒకటి అంతర్జాలంలో వైరల్‌ అవుతోంది.  ఇంటికి పెద్దకోడలిగా, ఉద్యోగినిగా ఎన్నో బాధ్యతల్ని ఒంటి చేత్తో చక్కబెట్టే లతకు సంతానం లేదు. తన తర్వాత ఆ ఇంట్లో అడుగుపెట్టిన తోడికోడలికి సీమంతం చేస్తుంటారు ఇంట్లో వాళ్లంతా. దాంతో లత కళ్లలో సన్నటికన్నీటి పొర ఒకటి కదులుతుంది. చివరిగా.. ‘అక్కా నీపేరే నాకు పుట్టబోయే పాపకు పెట్టుకుంటా’..అని తోడికోడలు చెప్పడంతో ముగిసే ఈ యాడ్‌ ‘అసలు స్త్రీగా పుట్టడమే సంపూర్ణత్వం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. మనసుని కదిలించే ఈ ప్రకటనని ఇంతవరకూ 23 లక్షలమంది వీక్షించారు. షీఈజ్‌కంప్లీట్‌ఇన్‌హెర్‌సెల్ఫ్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ప్రచారాన్ని చేస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని