చక్కెర వ్యాధి.. ఆహార ప్రణాళిక ఏంటి?
close
Updated : 05/03/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చక్కెర వ్యాధి.. ఆహార ప్రణాళిక ఏంటి?

నా వయసు 34. బరువు 70 కిలోలు. ఈ మధ్యే షుగర్‌ వచ్చింది. దీన్ని అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

- స్వాతి, హైదరాబాద్‌

స్త్రీలలో మధుమేహం రకరకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. చర్మ సమస్యలు, సంతానలేమితో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి దీన్ని అదుపులో పెట్టుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండాలంటే... ఆహారంలో మార్పులు, మందులు వాడటం, వ్యాయామం తప్పనిసరి. అధిక బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. అలాగే తక్కువగా ఉన్నవారు సరైన బరువుకు రావాలి. సమతులపోషకాహారంపై దృష్టి పెట్టాలి. పీచు ఉండే పదార్థాలను తింటే రక్తంలో ఒకేసారి చక్కెర స్థాయులు పెరగవు. మేలైన మాంసకృత్తులు తీసుకుంటే కండరాల పటుత్వం, పనితీరు బాగుంటాయి. దాంతో మధుమేహం దీర్ఘకాలంగా ఉండటం వల్ల వచ్చే కొన్నిరకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వేళకు ఆహారం తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినడం లేదా తినకపోవడం చేయొద్దు. రక్తంలో చక్కెర శాతం పరగడుపున, తిన్న తర్వాత ఎంత ఉందనేది స్వీయపరీక్ష ద్వారా తెలుసుకోవాలి.
వ్యక్తిగత ఆహార ప్రణాళిక.... ఆహారం తక్కువ తినలేనివారు తగినంత ఫుడ్‌ తీసుకుంటూ శారీరక శ్రమ ఎక్కువగా చేస్తూ రక్తంలో చక్కెరస్థాయులను నియంత్రించు కోవచ్చు. రోజులో ఎవరెవరు ఎంత ఆహారం తీసుకోవాలనేది ఆ వ్యక్తి బరువు, చేసే శారీరక శ్రమ మీద ఆధారపడుతుంది.  వ్యక్తిగత ఆహార ప్రణాళిక తప్పనిసరి. కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ముడి ధాన్యాలతోపాటు పాలు, పెరుగు, గుడ్డు, సోయా నగ్గెట్‌్్సను ఎంచుకోవచ్చు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని