థైరాయిడ్‌ ఉంటే పిల్లలు పుట్టరా?
close
Updated : 07/03/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థైరాయిడ్‌ ఉంటే పిల్లలు పుట్టరా?

పెళ్లై మూడేళ్లు అవుతోంది. ఇప్పుడు సంతానం కావాలనుకుంటున్నాం. థైరాయిడ్‌కి మందులు వాడుతున్నా. ఈ సమస్య ఉంటే పుట్టబోయే బిడ్డకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? ప్రెగ్నెన్సీలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - ఓ సోదరి
గొంతు దగ్గర వాయునాళానికి ఇరువైపులా సీతాకోకచిలుక ఆకారంలో థైరాయిడ్‌ గ్రంథి ఉంటుంది. శరీర అవసరాలకు సరిపడా హార్మోన్‌ను ఈ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. తగిన మొత్తంలో ఈ స్రావం విడుదల కాకపోవడాన్ని హైపోథైరాయిడిజమ్‌ అంటారు. మీకు ఇదే సమస్య ఉందనిపిస్తోంది. ఈ గ్రంథి స్రావం తక్కువగా ఉన్నవారిలో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటం, వచ్చినా గర్భం నిలవకపోవడం, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తడం, పుట్టిన బిడ్డలో బుద్ధిమాంద్యం.. లాంటి సమస్యలు ఎదురవుతాయి.  వీటితోపాటు ప్రసవం తర్వాత తల్లి కుంగుబాటుకు గురికావొచ్చు. అయితే థైరాయిడ్‌ సరిగ్గా నియంత్రణలో ఉంటే మాత్రం కడుపులోని బిడ్డకు, తల్లికి ఎలాంటి ఇబ్బందులు రావు. మూడు నెలలకోసారి హార్మోన్‌ స్థాయులను పరీక్షించుకుంటూ నియంత్రణలో పెట్టుకోవాలి.  కాబట్టి మీరు ఎండోక్రైనాలజిస్ట్‌, గైనకాలజిస్ట్‌ పర్యవేక్షణలో ఉంటూ దీన్ని నియంత్రించుకోవాలి.
థైరాయిడ్‌ సమస్యతోపాటు మిగతా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కనుక్కోవాలి. హార్మోన్ల అసమతౌల్యం, గర్భాశయం, అండాశయాల పనితీరు, రక్తంలో చక్కెర స్థాయులు.. వీటి పనితీరు ఎలా ఉందో చూసుకోవాలి. అలాగే మీవారు సెమన్‌ అనాలసిస్‌ పరీక్ష చేయించుకోవాలి. కేవలం ఈ సమస్య మాత్రమే ఉంటే మీరు కచ్చితంగా థైరాయిడ్‌ మాత్రలతోపాటు సెలీనియం ఉన్న ప్రీనేటల్‌ క్యాప్సుల్స్‌ను తప్పనిసరిగా వాడాలి. మీ థైరాయిడ్‌ స్థాయులు 2.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని