ఖైదీల బిడ్డలను తల్లిలా పెంచుతోంది!
close
Published : 09/03/2021 00:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఖైదీల బిడ్డలను తల్లిలా పెంచుతోంది!

క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల ఆ మహిళలకు జైలు జీవితం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏ తప్పూ చేయని వారి కన్నబిడ్డల పరిస్థితి ఏమిటి? అని ఆలోచించింది ఒడిశాకు చెందిన నీరజాలక్ష్మి మహాపాత్ర. ఖైదీల పిల్లల కోసం 2003లో ‘మధుర్‌మయీ ఆదర్శ శిక్షా నికేతన్‌’ అనే ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. జైలు అధికారులతో మాట్లాడి అక్కడి చిన్నారులను తన ఎన్జీవోకి తెచ్చుకుని అమ్మలా అక్కున చేర్చుకునేది. అలా ఇప్పటివరకు 200 మందికి విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు ఆ చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ, వారి కాళ్లపై వారు నిలబడేలా కృషి చేసింది.  వారంతా బాగా చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థలో యాభై మందికి పైగా చిన్నారులున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని