ఈ పొరపాట్లు.. చర్మానికి చేటు!
close
Published : 10/03/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ పొరపాట్లు.. చర్మానికి చేటు!

నిత్యజీవితంలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మానికి నష్టం కలుగుతుంది. మేనుకు అలా హాని చేసేవేంటో, వాటిని ఎలా సరి చేసుకోవాలో తెలుసుకుందామా...
దయం నిద్రలేవగానే ముఖం కడుక్కోకపోవడం వల్ల చర్మం పాడవుతుంది. సాధారణంగా మనం నిద్రించే సమయంలో సహజంగా చర్మం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. ఇందులో భాగంగా మలినాలు, సీబమ్‌ లాంటివి పేరుకుంటాయి. వాటిని తొలగించకుండా ఉంటే కొన్నాళ్లకు మొటిమలు, మచ్చలతో మోము నిర్జీవంగా కనిపిస్తుంది. కాబట్టి నాణ్యమైన క్లెన్సర్‌తో ఉదయం లేవగానే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
* సన్‌స్క్రీన్‌ వాడకపోవడం వల్ల చర్మానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. రంగు తగ్గడం, ముడతలు, మచ్చలతో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. కాబట్టి ఇంట్లోనైనా, బయటకు వెళ్లినా సన్‌స్క్రీన్‌ రాసుకోవడం తప్పనిసరి. అలాగే అన్ని కాలాల్లోనూ దీన్ని వినియోగించాలి.

* నిద్రకు ముందు స్కిన్‌కేర్‌ క్రీమ్‌ను వాడకపోవడం వల్ల చర్మానికి ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఈ సమయంలోనే అది తగినంత విశ్రాంత స్థితిలో ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు క్రీమ్‌ను రాస్తే చర్మంలోకి ఇంకి తాజాగా ఉండేలా చేస్తుంది.
* తలగడ, దిండు గలేబులను మార్చకపోవడంతో... నిద్రపోయేటప్పుడు ముఖం, జుట్టు, నోటి ద్వారా బోలెడు సూక్ష్మజీవులు తలగడపై వచ్చి చేరతాయి. ఇవన్నీ కలిసి చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి దిండు కవర్లను వారంలో ఒకట్రెండుసార్లు శుభ్రం చేయాల్సిందే.
* మృతకణాలు తొలగించకపోతే జరిగే నష్టం చాలా ఉంటుంది. కాబట్టి స్క్రబ్‌ ద్వారా మోమును శుభ్రం చేసుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అప్పుడే అది తాజాగా, కాంతివంతంగా ఉంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని