ఎలాగైతేనేం.. ప్రణవ్‌ సాధించాడు!
close
Published : 11/03/2021 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎలాగైతేనేం.. ప్రణవ్‌ సాధించాడు!

కర్ణాటకకు చెందిన ప్రణవ్‌ రికార్డు సృష్టించాడు. 14 సంవత్సరాల మూడు నెలల 15 రోజుల వయసులోనే చెస్‌లో ఇంటర్నేషనల్‌ మాస్టర్‌గా అవతరించాడు. కరోనా లాక్‌డౌన్‌, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల కారణంగా కాస్త ఆలస్యంగా ఈ ఘనతను అందుకున్నాడు.  
ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ప్రణవ్‌.. 2019లో జరిగిన పలు టోర్నీల్లో చక్కగా రాణించాడు. ఈ క్రమంలో ‘ఇంటర్నేషనల్‌ మాస్టర్‌’గా మారడానికి కేవలం 19 పాయింట్ల దూరంలో నిలిచిపోయాడు. కరోనా వల్ల ఓ సంవత్సరం పాటు అసలు టోర్నీలే లేకపోవడంతో ఒకింత ఆవేదనకు గురయ్యాడు. కానీ అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు తొలగిన తర్వాత గత నెల 8న సెర్బియాలో జరిగిన పోటీల్లో పాల్గొని మిగిలిన పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2,400 పాయింట్ల మార్కును చేరుకుని తన కలను సాకారం చేసుకున్నాడు.

అమ్మానాన్నల ప్రోత్సాహంతో..

నిజానికి ప్రణవ్‌ వాళ్ల కుటుంబీకులు కోయంబత్తూరుకు చెందినవారు. కానీ 17 సంవత్సరాల క్రితం బెంగళూరుకు వలస వచ్చారు. అమ్మానాన్నలు తనను చెస్‌లో ఎంతో ప్రోత్సహించారు. చక్కటి శిక్షణ ఇప్పించారు. వాళ్ల ప్రోత్సాహంతోనే అటు చెస్‌తో పాటు ఇటు చదువుల్లోనూ రాణిస్తున్నాడు.

ఎలాగైనా గెలవాలని..

మొదట్లో కరోనా లాక్‌డౌన్‌ వల్ల ప్రణవ్‌ ఒత్తిడికి గురైనప్పటికీ.. ఆ ఖాళీ సమయాన్ని తన ఆటను మెరుగుపరుచుకోవడానికి వినియోగించాడు. రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు చెస్‌లో శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం తాను ‘ఇంటర్నేషనల్‌ మాస్టర్‌’గా అవతరించినా.. ఇక్కడితో ఆగిపోనంటున్నాడు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తానంటున్నాడు. ముందుమాత్రం.. ఎలాగైనా సరే మేలో జరగనున్న టోర్నీలను గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లు ఇప్పటి నుంచే చెస్‌బోర్డుతో కుస్తీ పడుతున్నాడు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు చెస్‌లో గ్రాండ్‌ మాస్టర్‌గా నిలవడమే తన ఆశయం అని చెబుతున్నాడు. మరి మనమూ ప్రణవ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని