చిన్నారికి పనులు చెప్పండి..
close
Published : 15/03/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారికి పనులు చెప్పండి..

చిన్నారులో జ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాల్లోని పాఠాలను నేర్పుతాం. శారీరకంగా దృఢంగా మారేందుకు, సంతోషంగా ఉండేందుకు ఆటలు ఆడుకోమంటాం. అయితే ఇంటి పనులు... ముఖ్యంగా వంట పనుల్లో వారిని భాగస్వాములను చేయడం వల్ల వారికి బోలెడు లాభాలు చేకూరతాయి. అవేంటో తెలుసుకుందామా...
మీరు వంట చేసే సమయంలో చిన్నారులను భాగస్వాములను చేయండి. ఇలా చేయడం వల్ల వంట గదిలో ఉండే చాలా రకాల పదార్థాల పేర్లు, వాటి గుణాలను తెలుసుకుంటారు. అలాగే అమ్మతో ఎక్కువ సమయం గడపుతారు. దాంతో తల్లీ బిడ్డల మధ్య బంధం మరింత బలపడుతుంది.
చిన్నప్పటి నుంచే... కూరగాయలు కడగడం, దినుసులు అందించడం లాంటి చిన్న చిన్న పనుల్లో అమ్మకు సాయం చేయడం అలవరచాలి. దాంతో చిన్నప్పటి నుంచీ సాయపడే గుణం అలవడుతుంది.
ఆరోగ్యం... అవగాహన... శారీరకంగా మంచి వ్యాయామంలా అనిపిస్తుంది. ఏయే కూరలు ఎలా వండుతున్నారో, ఏయే పదార్థాలు ఎంత వేయాలి? వాటి రంగు, రుచి, వాసన ఇలా అన్ని తెలుసుకుంటారు. దీంతో వారికి తెలుసుకోవాలనే జిజ్ఞాస అన్నింటిలోనూ పెరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్య, అనారోగ్యకరమైన ఆహారాల మధ్య ఉండే తేడాను స్పష్టంగా గుర్తించ గలుగుతారు. దాంతో జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు.
భవిష్యత్తు కోసం... పెద్దవాళ్లతో కలిసి పనిచేసిన అనుభవం చిన్నారులకు భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది. అలాగే పనులను  పూర్తిచేయడానికి ఓపిగ్గా ఉండటం ఎంతో అవసరమనే విషయాన్నీ వాళ్లు అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని