నాజూకైన నడుము కోసం...
close
Updated : 21/03/2021 05:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాజూకైన నడుము కోసం...

నడుము, పొట్ట దగ్గర కొంత మందికి అదనపు కొవ్వు చేరుతుంది. చూడ్డానికి ఇబ్బందికరంగా ఉండే దీన్ని ఈ వ్యాయామాలతో తగ్గించుకోవచ్చు. దీంతో ఆయా భాగాల్లోని కండరాలూ బలోపేతమవుతాయి.
కాళ్లను ముందుకు చాపి నిటారుగా కూర్చోవాలి. కాళ్ల మధ్య అడుగు దూరం ఉండాలి. ఎడమచేత్తో కుడికాలి బొటనవేలు పట్టుకోవాలి. కుడిచేతిని భుజానికి సమానంగా చాపి వెనక్కు తిరిగి అర నిమిషం పాటు ఉండాలి. తర్వాత కుడిచేత్తో ఎడమకాలి బొటనవేలు పట్టుకుని వెనక్కు తిరగాలి. రెండువైపులా కలిపి పదిసార్లు చేయాలి. దీంతో మెడ, భుజాలు, నడుము దగ్గరి కండరాలూ బలోపేతమవుతాయి.


కాళ్ల మధ్య దూరం ఉంచి నిటారుగా కూర్చోవాలి. కుడికాలిని పైకి లేపి ఎడమచేత్తో కుడిపాదాన్ని పట్టుకోవాలి. కుడిచేతిని ఫొటోలో చూపించిన విధంగా పెట్టాలి. అర నిమిషంపాటు ఇదే స్థితిలో ఉండాలి. తర్వాత ఎడమకాలిని పైకి పెట్టి కుడిచేత్తో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. రెండు వైపులా ఇలా పదిసార్లు చేయాలి. దీంతో కాళ్లు, నడుము దగ్గరి అదనపు కొవ్వు కరుగుతుంది.


వజ్రాసనంలో కూర్చుని శ్వాస వదులుతూ కుడివైపు తిరిగి భుజాలు, తలను వంచాలి. చేతులను నేల మీద ఆనించాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేచి ఇదేవిధంగా ఎడమవైపు తిరగాలి. రెండువైపులా కలిపి ఇలా పదిసార్లు  చొప్పున చేయాలి. దీంతో నడుము, పొట్ట దగ్గరి అదనపు కొవ్వు త్వరగా కరుగుతుంది. బాగా నడుము నొప్పి వస్తే మాత్రం చేయడం ఆపేయాలి.  


మేరుదండ ముద్ర:  నేల మీద నిటారుగా సుఖాసనంలో కూర్చుని చేతులను మోకాళ్ల మీద ఉంచాలి. బొటనవేలు పైకి పెట్టి మిగతా నాలుగు వేళ్లు మూసి ఉంచాలి. కళ్లు మూసుకుని వెన్నెముక మీద ధ్యాస ఉంచి శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. దీన్ని మూడు నుంచి ఐదు నిమిషాలపాటు సాధన చేయాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని