ఇల్లు సర్దండిలా!
close
Published : 22/03/2021 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇల్లు సర్దండిలా!

కాలంతోపాటు మన ఆహారం, ఆహార్యం, అందానికి సంబంధించిన విషయాల్లో మార్పులు చేసుకుంటాం.  మన చుట్టూ ఉన్న ఇంటి వాతావరణం ఇందుకు మినహాయింపు కాదు. మండే ఎండల నుంచి ఉపశమనం పొందడానికి, అలాగే ఇంటిని చల్లగా ఉంచడానికి  ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

స్థలం కలిసొచ్చేలా... చిన్నారుల ఆట వస్తువులు, రిమోట్‌ కంట్రోల్‌, మొబైల్‌ ఫోన్‌లు ... ఇలాంటి చిన్న చిన్న వస్తువులను చక్కగా సర్ది అందమైన బుట్టల్లో వేసేయండి. ఇలా చేస్తే ఇల్లంతా చెల్లాచెదురుగా ఉండదు. రంగు రంగుల బుట్టలతో ఇంటికి కొత్తందం వస్తుంది.

ప్రకాశమంతమైన రంగులు... పసుపు, నారింజ, ఆలివ్‌ రంగులు చాలా ప్రకాశమంతంగా ఉంటాయి. వీటిని గోడలకు ఎంచుకుంటే కాంతివంతంగా కనిపిస్తాయి. తెలుపు రంగు చల్లటి వాతావరణాన్ని అందిస్తుంది. కాబట్టి ఎంచక్కా దీన్ని ఎంచుకోవచ్చు.
పరదాలు.. ప్రత్యేకంగా.. కిటికీలు, తలుపులకు కొత్త అందాన్ని తెచ్చేవి పరదాలే. కాబట్టి చక్కటి వాటిని చూసి ఎంపిక చేసుకోవాలి.  ఆకుపచ్చటి రంగువి ఎంచుకుంటే ప్రకృతి అంతా మీ చుట్టూ ఉన్నట్లే కనిపిస్తుంది. అలాగే పరదాల ఎంపిక సమయంలో సోఫా రంగులను దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే గది అందం పోతుంది.

ఎకో ఫ్రెండ్లీ డెకార్‌.... ఎండాకాలంలో ఇంటికి కొత్త కళను తేవాలనుకుంటే వెదురు, కొబ్బరి పీచుతో తయారుచేసిన ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి ఇంటికి చల్లదనంతోపాటు కొత్త లుక్‌నూ ఇస్తాయి.

పరిమళాలు వ్యాపించేలా... ఇల్లంతా అలుముకునేలా ఆహ్లాదభరితమైన పరిమళాలతో కూడిన రూమ్‌ ఫ్రెష్‌నర్స్‌ను స్ప్రే చేయండి లేదా కప్పు నీళ్లలో కొన్ని చుక్కల ఆరోమా నూనె వేసి గది అంతా స్ప్రే చేస్తే సరి. లావెండర్‌ సుగంధ పరిమళాలను దిండ్లు, దివాన్‌ మీద చల్లితే సువాసనలు వెలువడతాయి. అలాగే సుగంధ పరిమళాలనిచ్చే కొవ్వొత్తులను వెలిగించినా ఇంటికి కొత్త లుక్‌తోపాటు చక్కటి సువాసనలూ చుట్టూతా వ్యాపిస్తాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని