ఆఫీసులో అదేపనిగా కూర్చుంటున్నారా!
close
Published : 22/03/2021 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆఫీసులో అదేపనిగా కూర్చుంటున్నారా!

గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల చాలా రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. కాబట్టి పనిచేసే సమయంలోనే చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచు కోండిలా..

రోజూ తప్పనిసరిగా కనీసం అరగంట సేపైనా వ్యాయామానికి కేటాయించుకోవాలి. దీంతోపాటు...
* ఆఫీసు వ్యవహారాలకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ వచ్చినప్పుడు ఆ రెండు మూడు నిమిషాలపాటు లేచి నిలబడి, అటూఇటూ తిరుగుతూ మాట్లాడండి.
* టీ విరామం, భోజన సమయంలో ఓ ఐదు నిమిషాలపాటు నడవండి. అలాగే వీలైనంత వరకు కార్యాలయంలో మీ అంతస్థును చేరుకోవడానికి మెట్లనే ఉపయోగించండి.
* మీకు కావాల్సిన ఫైల్స్‌, ఇతర అవసరాల కోసం అప్పుడప్పుడు సీట్లోంచి లేచి నాలుగడుగులు వేయండి.
* టీ బ్రేక్‌లో మీ సహోద్యోగుల దగ్గరకు వెళ్లి మాట కలపండి.
* సమావేశాల్లో ఏదైనా అంశాన్ని ప్రజెంట్‌ చేస్తున్న సందర్భంలో వీలైనంతమటుకు నిల్చొనే ఉండండి.
* ఉదయం, సాయంకాలం.. కాసేపు కార్యాలయ పరిసరాల్లో నడిస్తే చాలా మంచిది.
* ఆఫీసులో ఉన్నంతసేపు ఉత్సాహంగా ఉండాలంటే ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి అటూ ఇటూ నడవాలి. చిన్న చిన్న స్ట్రెచ్చింగ్స్‌ చేయాలి. దీర్ఘశ్వాస తీసుకోవడం వల్ల కూడా లాభమే.
* మీ సహోద్యోగులతో కలిసి వారంలో ‘ఇంత సమయం నడవాలి’ అని లక్ష్యం పెట్టుకోండి.
* వీలైతే మీరున్నచోట తేలికైన డంబెల్స్‌, రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌ ఉండేలా ఏర్పాటు చేసుకోండి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని