తగ్గిన రంగు మళ్లీ వస్తుందా...
close
Updated : 22/03/2021 02:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తగ్గిన రంగు మళ్లీ వస్తుందా...

నా వయసు 25. చామన ఛాయగా ఉంటాను. ఈమధ్య రంగు కాస్త తగ్గాను. రెండునెలల్లో నా పెళ్లి. ఈలోగా నా కలర్‌ నాకు తిరిగి వచ్చే అవకాశం ఉందా?

- ఓ సోదరి

మన చర్మంలో మెలనిన్‌ అనే పిగ్మెంట్‌ ఉంటుంది. శరీరఛాయ దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి, హార్మోన్లలో తేడాలు, తగినంత నిద్ర లేకపోయినా మెలనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతోపాటు కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, దురదలున్నా...ఎక్కువగా ఎండలోకి వెళ్లినా రంగు తగ్గుతారు. అతినీలలోహిత కిరణాల వల్ల మెలనిన్‌ ఉత్పత్తి ఎక్కువైతే ఛాయ తగ్గుతుంది. ఇంకా చర్మానికి సరిపడని సౌందర్య ఉత్పత్తుల వాడటం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, విపరీతంగా డైటింగ్‌ చేయడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.
ఏమేం తినాలంటే... జంక్‌ఫుడ్‌, మసాలా పదార్థాలకు దూరంగా ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3, 6, ఫ్యాటీయాసిడ్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. నట్స్‌, సన్‌ఫ్లవర్‌, చియా సీడ్స్‌, వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి.
* ఎండలోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్‌ క్రీమ్‌ రాసుకోవాలి. చర్మ తత్వాన్ని బట్టి విటమిన్‌-సి, ఇ, గ్లైకాలిక్‌, మాండలిక్‌, కోజిక్‌ యాసిడ్‌ కలిసిన క్రీమ్‌లు వాడాలి. వీటన్నింటికంటే ముందు పోషకాహారం, వ్యాయామం, తగినంత నిద్ర ఎంతో అవసరం.
చిట్కాలు:  నిమ్మరసం, పంచదార చెంచా చొప్పున కలిపి రాసుకుంటే మృతకణాలు తొలగి చర్మం మెరుస్తుంది. చెంచా తేనెలో కొద్దిగా నిమ్మరసం కలిపీ రాయొచ్చు. పెరుగులో అరటిపండు గుజ్జు, తేనె కలిపి పూతలా ముఖానికి వేయాలి. అలాగే దాల్చినచెక్క పొడిలో తేనె కలిపి రాసినా ఫలితం ఉంటుంది. రాత్రిళ్లు తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ వాడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని