ఆ పని చేయగలనా...
close
Updated : 25/03/2021 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ పని చేయగలనా...

ఇప్పటివరకూ ఓ చిన్న టీమ్‌కి లీడ్‌గా పనిచేసేదాన్ని. ఇప్పుడు డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా బాధ్యతలు అప్పగించారు. ఒక్కసారిగా అంత పెద్ద బాధ్యతలని తీసుకోవడం అంటే భయంగా ఉంది. నా పనితీరులో ఏమైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటుందా?  

- ఓ సోదరి

చిన్న బృందంతో కలిసి పనిచేసినప్పుడు... వాళ్లతో మీ ఆలోచనలు పంచుకోవడం, కోరుకున్న ఫలితాలు రాబట్టుకోవడం తేలిగ్గానే ఉంటుంది. కానీ మీరు ఇప్పుడు ఒక విభాగానికి అధిపతి. ఇందుకోసం మీ పనితీరులో కచ్చితంగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా బృందంతో కలిసి పనిచేస్తే సరిపోదు. ముఖ్యంగా మీపై అధికారులకు మీరు జవాబుదారీగా ఉండాలి. ఒక పక్కపై అధికారులతో సమన్వయం చేసుకుంటూనే చక్కటి పనివాతావరణం కల్పించాలి. మీ టీమ్‌లోని ప్రతి ఒక్కరి బలాబలాలు క్షుణ్ణంగా మీకు తెలిసి ఉండాలి. వారి నైపుణ్యాలని గుర్తిస్తున్నారన్న విషయం వాళ్లకి కూడా అర్థం కావాలి. అప్పుడే వారిలో ప్రతిభ బయటపడుతుంది. అలాగే ప్రతి విషయానికి మీపై ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొనే శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని మీరు వాళ్లకి కల్పించాలి. వాళ్లు చేపట్టే ప్రాజెక్టులకు వాళ్లే బాధ్యులు అన్న విషయం అర్థమైతే మరింత అంకితభావంతో పనిచేస్తారు. ఇది జరగాలంటే మీకు కమ్యునికేషన్‌ నైపుణ్యాలు చాలా అవసరం. సభ్యులతో తరచూ ముఖాముఖి సమావేశాలు పెడుతూ ఉండండి. వాళ్ల పనితీరులో లోపాలుంటే మీరే విడమరచి చెప్పండి. అలాగే మీలోని లోపాల గురించి చెప్పే స్వేచ్ఛని కూడా వారికి ఇవ్వండి. లేదంటే మీ దగ్గర చెప్పని విషయాలని ఇతరులతో పంచుకుంటారు. దానివల్ల పని వాతావరణం దెబ్బతింటుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని