పాపాయి పక్క తడుపుతుంటే!
close
Published : 30/03/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాపాయి పక్క తడుపుతుంటే!

నెలల పాపాయి నుంచి రెండు మూడేళ్ల చిన్నారుల వరకు పక్క తడపడం అనేది సాధారణం. ఎందుకంటే ఆ ప్రాయంలో వారు దాన్ని నియంత్రించుకోలేరు కాబట్టి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఇబ్బంది తగ్గిపోతుంది. అలా కాకుండా సమస్య అలాగే ఉంటే...
* నిద్రబోయే ముందు చిన్నారులను తప్పనిసరిగా టాయిలెట్‌కు తీసుకువెళ్లాలి. ఇలా అలవాటు చేస్తే పిల్లల్లో పక్కతడపడం సమస్య క్రమంగా తగ్గిపోతుంది. అలాగే పడుకునే రెండు గంటల ముందు నుంచి చిన్నారికి కెఫిన్‌, చక్కెరలతో కూడిన ద్రవపదార్థాలను ఇవ్వకూడదు. ఇవి మూత్రానికి ఎక్కువసార్లు వెళ్లేలా చేస్తాయి.
* చిన్నారుల వల్ల ఏదైనా పొరపాటు జరిగితే వారిని మన్నించండి. అంతే తప్ప తిట్టడం, కొట్టడం లాంటివి చేయొద్దు. ఇలాచేస్తే వారిలో తెలియకుండానే ఒత్తిడి, భయం పెరిగిపోయి నిద్రలో పక్క తడిపేస్తారు.
* పక్కతడపని రోజు చిన్నారిని ప్రశంసించండి.  వీలైతే తనకు ఇష్టమైనది కానుకగా ఇవ్వండి. దీంతో పాపాయి క్రమంగా ఈ అలవాటును మానుకునే అవకాశం ఉంది.
* పిల్లలను మధ్యమధ్యలో లేపి టాయిలెట్‌కు తీసుకువెళ్లాలి. కాస్త పెద్ద చిన్నారుల్లో ఈ సమస్య ఉంటే ‘ఇంత పెద్దగా అయ్యాక కూడా ఇదేం పని’ అంటూ చిన్నారిని గేలి చేయొద్దు. ఇది సమస్య కాదని క్రమంగా తగ్గుతుందని వారికి నచ్చజెప్పాలి.
* వారు పెరుగుతున్నా సమస్య తగ్గుముఖం పట్టకపోతే, ఓసారి పిల్లల వైద్యనిపుణుల దగ్గరకు తీసుకువెళ్లాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని