పాతవి పారేయకుండా... వాడండిలా!
close
Published : 01/04/2021 00:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాతవి పారేయకుండా... వాడండిలా!

అందానికి మరింత మెరుగులు దిద్దుకోవడానికి సౌందర్య ఉపకరణాలు వాడటం మామూలే. అయితే వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ వీటి గడువు ముగిసిపోతే... ఏం చేయాలి? వాటిని వ్యర్థంగా భావించి బయటపడేయకుండా ఇలానూ ఉపయోగించొచ్చు. అదెలాగంటే...

లిప్‌బామ్‌: గడువు ముగిసిన దీన్ని కాలి పగుళ్లకు రాసుకోవచ్చు. అలాగే గోళ్లు తేమగా ఉండేందుకూ వాడొచ్చు.

పెర్‌ఫ్యూమ్‌: నిర్ణీత తేదీ దాటిన తర్వాత ఈ పరిమళాన్ని అలా వాడకుండా పక్కన పడేయొద్దు. రూమ్‌, బాత్రూమ్‌ ఫ్రెష్‌నర్‌లా వాడుకోవచ్చు.

ఎండిపోయిన మస్కారా... కనురెప్పలను దట్టంగా మార్చి కళ్లకు కొత్త అందాన్ని ఇచ్చే మస్కారా ఎండిపోయిందా లేదా గడువు ముగిసిందా... అయితే దీన్ని కనుబొమలను ఒత్తుగా కనిపించేందుకు వాడుకోవచ్చు.

ఫేషియల్‌ టోనర్‌.... ముఖాన్ని శుభ్రం చేయడానికి వాడే దీని జీవితకాలం ముగిస్తే.... దీంతో స్నానాల గదిలో టైల్స్‌, గాజుతో చేసిన కిటికీలు, అద్దాలు తుడిస్తే తళతళా మెరుస్తాయి. ఇలా వాడితే డబ్బు ఆదా అవడంతోపాటు ఇంటి పరిసరాలు ప్రకాశవంతంగా మారతాయి.

ఐ షాడో... దీంట్లో బోలెడు రంగులుంటాయి. దీని గడువు ముగిసిపోతే బయట పారేయక్కర్లేదు. గోళ్లకు రంగుగా వాడుకోవచ్చు. పారదర్శక నెయిల్‌పాలిష్‌లో దీన్ని కలిపి వేసుకుంటే సరి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని