వారిని నిర్లక్ష్యం చేయొద్దు!
close
Published : 01/04/2021 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వారిని నిర్లక్ష్యం చేయొద్దు!

మూడేళ్ల అనన్యను చూస్తే ఎవరికైనా గారాబం చేయాలనిపిస్తుంది. ముద్దుముద్దుగా మాట్లాడే ఆ పాప మాటలను ఒకటికి రెండు సార్లు చెప్పించుకుని మరీ సంబరపడేది ఆమె తల్లి నిహారిక. కానీ ఇప్పుడు ఆమెకు తమ్ముడు పుట్టాడు. ఇంట్లో అందరూ తమ్ముడిపై ఎక్కువ శ్రద్ధ చూపించడం  అనన్యకు నచ్చడం లేదు. దాంతో అరుస్తూ, ఏడుస్తూ,  మొండితనం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి చాలామంది ఇళ్లల్లో కనిపిస్తుంటుంది. ఎందుకిలా...
బాధ్యత నేర్పండి...
ఇంట్లో మీ పాపకు తమ్ముడో, చెల్లాయో వచ్చినప్పుడు వారి ప్రవర్తనలో మార్పు వస్తే చూసీ చూడనట్లు వదిలేయకండి. ఆ పాపాయీ తమ కుటుంబంలో ఓ భాగమేనని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే తాను ఒంటరినని భావించే ప్రమాదం ఉంది. పాపాయికి సంబందించిన చిన్నచిన్న పనులు వారికి అప్పజెప్పాలి.
మార్పు కనిపించనీయొద్దు... సాధారణంగా ఇంట్లో తొలికాన్పులో పుట్టిన చిన్నారిని అతి గారాబంగా చూస్తారు. రెండో సంతానం రాకతో వారి సంరక్షణలో పడిన తల్లి అనుకోకుండానే పెద్దపిల్లలకు కొంత దూరంగా ఉండాల్సి వస్తుంది. అప్పటివరకు అమ్మ తనకే సొంతం అనుకున్న చిన్నారులు క్రమంగా అభద్రతకు గురవుతుంటారు. దాంతో మొండిగా ప్రవర్తిస్తారు. అందుకే ఎంత తీరిక లేకున్నా...రోజులో కొంత సమయం వారికి కేటాయించండి.
ఒత్తిడి పెంచొద్దు... తమ్ముడు లేదా చెల్లిని అందరూ ముద్దు చేస్తుంటే పెద్ద పిల్లల్లో అసూయ కలగడం సహజమే అంటున్నారు నిపుణులు. అలానే పదే పదే ‘పెద్దవాడివి కదా! నువ్వే సర్దుకుపోవాలి’ అంటూ వారిపై ఒత్తిడి పెంచొద్దు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని