రుమటాయిడ్‌ మందులేసుకుంటే టీకా తీసుకోవచ్చా?
close
Updated : 06/04/2021 06:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రుమటాయిడ్‌ మందులేసుకుంటే టీకా తీసుకోవచ్చా?

సమస్య - సలహా

సమస్య: నాకు 46 ఏళ్లు. గత 20 సంవత్సరాల నుంచి రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌తో బాధపడుతున్నాను. ప్రస్తుతం రెండు నెలలకోసారి ఎటనర్‌సెప్ట్‌ బయోలాజికల్‌ ఇంజెక్షన్లు తీసుకుంటున్నాను. నేను కరోనా టీకా వేయించుకోవచ్చా?

-డి.ఎస్‌.ప్రభాకర రావు, భీమవరం

సలహా: మీరు ఎటనర్‌సెప్ట్‌ ఇంజెక్షన్‌ తీసుకుంటున్నా నిరభ్యంతరంగా కరోనా టీకా వేయించుకోవచ్చు. టీకాకు ముందు గానీ తర్వాత గానీ ఇంజెక్షన్‌ను ఆపాల్సిన పనిలేదు. సాధారణంగా రుమటాయిడ్‌ ఆర్థ్రయిటిస్‌, ల్యూపస్‌ బాధితులు ఇతరత్రా మందులూ వేసుకుంటుంటారు. మీరు ఇంకేమైనా మందులు వాడుతున్నారేమో తెలియజేయలేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌, తక్కువ మోతాదు ప్రెడ్నిసొలోన్‌, సల్ఫసలజైన్‌, లెఫ్లునొమైడ్‌, మైకోఫెనొలేట్‌, అజథయాప్రైన్‌, సైక్లోఫాస్ఫమైడ్‌ మాత్రలు.. రెమికేడ్‌, ఎంబ్రెల్‌, టొసిలిజుమాబ్‌, సెకుకినుమాబ్‌, అడలిముమాబ్‌ ఇంజెక్షన్లు  వేసుకుంటుంటే కరోనా టీకా తీసుకోవచ్చు. మిథట్రక్సేట్‌ వాడుతుంటే మాత్రం ఒక వారం మోతాదును ఆపెయ్యాల్సి ఉంటుంది. అంటే టీకా తీసుకున్నట్టయితే పైవారంలో వేసుకోవాల్సిన మిథట్రక్సేట్‌ మోతాదును ఆపెయ్యాలన్నమాట. టోఫాసిటినిబ్‌, బారిసిటినిబ్‌ మందులు వాడేవారైతే టీకా తీసుకున్నాక వారం తర్వాతే తిరిగి ఆరంభించాలి. సైక్లోఫాస్ఫమైడ్‌ ఇంజెక్షన్‌ వాడేవారూ టీకా వేయించుకున్న వారం తర్వాతే దీన్ని తీసుకోవాలి. ఇక రిటుక్సిమాబ్‌ ఇంజెక్షన్లు వాడేవారైతే రెండు టీకాల మోతాదులు పూర్తయ్యాక 2-4 వారాల తర్వాతే వీటిని తిరిగి కొనసాగించాలి.


నెల వరకు ఆగాలా?

సమస్య: మా కుటుంబ సభ్యులకు గత వారం కరోనా వచ్చి తగ్గిపోయింది. కొవిడ్‌ తగ్గిన తర్వాత నెల వరకు టీకా తీసుకోవద్దని విన్నాను. నిజమేనా?

- రాధాకృష్ణ (ఇ-మెయిల్‌)

సలహా: నిజమే. కొవిడ్‌-19 ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నాక నెల వరకు కరోనా టీకా తీసుకోవద్దు. ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డప్పుడు ఒంట్లో యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఇలాంటి స్థితిలో టీకా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ తికమకపడిపోవచ్చు. దీని మీద భారం పెరగొచ్చు. అందువల్ల నెల వరకు ఆగటమే మంచిది. అప్పటికి యాంటీబాడీల ఉత్పత్తి కాస్త నెమ్మదిస్తుంది. అప్పుడు టీకా తీసుకుంటే మరింత రక్షణ లభిస్తుంది. ఇన్‌ఫెక్షన్‌తో పుట్టుకొచ్చిన యాంటీబాడీలు ఉంటాయి కదా. మళ్లీ టీకా ఎందుకనే సందేహం రావొచ్చు. చాలామందిలో జబ్బు నుంచి పూర్తిగా కాపాడేంత స్థాయిలో యాంటీబాడీలు తయారుకావటం లేదు. అందువల్ల ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారూ టీకా తీసుకోవటం తప్పనిసరి. నిజానికి ఆటలమ్మ, తట్టు వంటి ఇన్‌ఫెక్షన్లు వస్తే జీవితాంతం రక్షణ లభిస్తుంది. అంటే మరోసారి రావన్నమాట. కానీ కొవిడ్‌-19లో అలాంటిది కనిపించటం లేదు. దీనికి కారణం- యాంటీబాడీలు తగినంతగా తయారుకాకపోవటం. తయారైనా ఎక్కువ కాలం ఉండకపోవటం. టీకాతోనూ సుమారు ఏడాది వరకే రక్షణ లభిస్తుంది. అంటే ఏటా టీకా తీసుకోవాల్సి ఉంటుందనే అర్థం.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని