పిల్లలు.. మీ నుంచే నేర్చుకుంటారు!
close
Updated : 13/04/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లలు.. మీ నుంచే నేర్చుకుంటారు!

పిల్లల్ని ఫోన్‌ ఎక్కువగా వాడొద్దని చెబుతూ ఉంటాం.  కానీ అసలు వాళ్లకా అలవాటు మాన్పించాలంటే...ముందు మీరూ మారాలని ఎప్పుడైనా గుర్తించారా? లేదంటే దీర్ఘకాలంలో ఎన్నో అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్లని అనుకరిస్తారు. కాబట్టి మీరు ఫోన్‌ ఎక్కువగా వాడితే, మీ పిల్లలు కూడా దానికి బానిసలవుతారు. ‘ఫోన్‌ పక్కన పెట్టి చదువుకో అని కసిరితే’ మరి మీరూ వాడుతున్నారుగా అని ఎదురు ప్రశ్న వేస్తారు. అందుకే వాళ్ల ముందు ఎక్కువగా ఫోన్‌ వాడకండి.
ఆకర్షితులవుతారు...
అమ్మానాన్నలు స్మార్ట్‌ ఫోన్లు వాడే సమయంలో పిల్లలను ఒడిలో ఉంచుకుని ఆపరేట్‌ చేస్తుంటారు. అలాంటప్పుడు ఫోన్‌ ఆపరేట్‌ చేసే విధానం, సమాచారాన్ని ఏకాగ్రతతో చూడటం వల్ల ఆ గాడ్జెట్‌కు ఇట్టే ఆకర్షితులవుతారు. దాంతో ఫోన్‌ ఇవ్వకపోతే గోల చేస్తారు. వీలైనంతవరకూ పిల్లలతో ఆడేటప్పుడు దాన్ని దగ్గర ఉంచుకోవద్దు. మీరూ కొన్ని నియమాలు పాటిస్తేనే...వారినీ అదుపు చేయగలరు.
దూరం పెడతారు..
మీరు ఫోన్‌లో మునిగిపోయి పిల్లల్ని పట్టించుకోకపోవడం, వాళ్లతో సరిగా సమయాన్ని గడపకపోవడంతో వారి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. మీ ప్రవర్తనతో వాళ్లలో అసహనం, చిరాకు, కోపంవంటివి పెరుగుతాయి. అప్పట్నుంచే మిమ్మల్ని దూరం పెట్టడం మొదలుపెడతారు. కాబట్టి మీరు చిన్నారులతో  ఉన్నప్పుడు ఫోన్‌ పక్కన పెట్టి వాళ్లతో సమయాన్ని గడపండి. మార్పు మీరే చూస్తారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని