హెలీకాప్టర్లో దిగింది రియా!
close
Updated : 23/04/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 హెలీకాప్టర్లో దిగింది రియా!

గ్రామ ప్రజలంతా రియా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అంతలో హెలికాప్టర్‌లో రియా రానేవచ్చింది. ఆమెకు ఆప్యాయంగా పూలమాలలు వేసి గౌరవించారామె కుటుంబ సభ్యులు. నృత్యాలు, పూల జల్లులతో తనను ఇంటికి తీసుకువెళ్లారు. ఇలా అఖండ మర్యాదలను అందుకున్న రియా వయసు రెండు నెలలే!! 35 ఏళ్లుగా ఆడపిల్లల్లేని ఇంట్లో పుట్టడం వల్లే ఆ పాపకు అంతటి ఆదరణ దక్కింది. ఆడపిల్ల పుడితే శాపమని భావించే రాజస్థాన్‌లో ఈ సంఘటన జరగడం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

నాగౌర్‌ జిల్లాకు చెందిన మదన్‌లాల్‌ కుమ్‌హర్‌ వంశంలో 35 ఏళ్లుగా ఆడపిల్ల పుట్టలేదు. ఈ ఏడాది మార్చిలో ఆయన కొడుకు హనుమాన్‌రామ్‌ ప్రజాపత్‌ భార్య ప్రసవించింది. ఆడపిల్ల పుట్టడంతో ఆ కుటుంబం కల తీరింది. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని భావించారంతా. ఈ సందర్భాన్ని గ్రామమంతా ఇలా వేడుకలా చేయడమే కాకుండా, అమ్మమ్మ ఊరి నుంచి వస్తున్న రియాకు ఆహ్వానం పలకడానికి సంప్రదాయ నృత్యాలు, భజనలు ఏర్పాటు చేశారు. పూల వర్షం కురిపించారు. అమ్మాయి పుట్టుకను ఓ వేడుకలా చేసుకోవాలంటూ అందరికీ ఈ విధంగా పిలుపునిచ్చామన్నాడు రియా తండ్రి. ‘గతంలో ఈ ప్రాంతమంతా అమ్మాయి పుట్టడమొక శాపంగా భావించే వారు. ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. ఇది సరిపోదు. ఆడపిల్లని ఇంటికి వరంగా భావించే పరిస్థితి రావాలి. మహిళా సాధికారత పెరగాలి’ అని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు హనుమాన్‌. అందరమూ కోరుకుంటోంది అదే కదా!మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని