పుట్టగొడుగుల పకోడీ!
close
Updated : 15/06/2021 12:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుట్టగొడుగుల పకోడీ!

ముప్పై ఏళ్లుగా...రుచులు పంచుతూ!

రాజమహేంద్రవరంలో పుట్టగొడుగుల పకోడీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఏవీ అప్పారావు రోడ్డు కూడలి. అక్కడ విత్తనాల రామకృష్ణ, మీనాక్షి దంపతులు పుట్టగొడుగుల పకోడిని తయారుచేసి విక్రయిస్తుంటారు. 30 ఏళ్ల కిందట మీనాక్షి తల్లిదండ్రులు కుడుపూడి సత్యనారాయణ, సత్యవతి హైదరాబాద్‌ నుంచి తెచ్చిన పుట్టగొడుగులతో పకోడీని తయారుచేసి రాజమహేంద్రవరం వాసులకు రుచి చూపించారట. రుచి చూసిన వారంతా ఆహా అనడంతో అప్పటి నుంచి నేటివరకూ వ్యాపారం కొనసాగిస్తున్నారు. ‘శ్రీదేవి ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌’ పేరుతో  పుట్టగొడుగుల పకోడీలతోపాటు ఇతరత్రా పకోడీలు, బజ్జీలు, బోండాలు అమ్ముతున్నారు. అయినా వీటికే గిరాకీ  ఎక్కువ అవుతుందని చెబుతున్నారు.

తయారీ: కిలో పుట్టగొడుగులను బాగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిలో అర కిలో సెనగపిండి, 50 గ్రాముల మొక్కజొన్నపొడిని వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలపాలి. ఈ మిశ్రమంలో పెద్ద చెంచా అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, రెండు చెంచాల చొప్పున కారం, గరంమసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో తగినంత నూనె వేసి బాగా మరగబెట్టాలి. కాగిన నూనెలో పుట్టగొడుగుల మిశ్రమాన్ని పకోడిలా వేసి పచ్చివాసన పోయి, ఎర్రని రంగు వచ్చే వరకూ బాగా వేయించాలి. అంతే నోరూరించే వేడివేడి మష్రూమ్‌ పకోడీ రెడీ.

వై.శ్రీనివాసరావు, ఈనాడు, రాజమహేంద్రవరం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని