దూరాన్ని దగ్గర చేయండిలా
close
Published : 01/05/2021 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దూరాన్ని దగ్గర చేయండిలా

ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక్కోసారి బదిలీల కారణంగానో లేక మరే ఇతర కారణాల వల్లనో వేరు వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ దూరం దగ్గర చేయాలి కానీ కొంతమంది అపోహలతో అనుమానాలతో దూరాన్ని పెంచుకుంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి.  
నమ్మకం ముఖ్యం
ఏ బంధమైనా నిలబడాలంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి శారీరకంగా దూరంగా ఉన్నా మానసికంగా దగ్గరవ్వాలి. అంటే అన్ని విషయాల్లోనూ భాగస్వామిని నమ్మితేనే ఆ బంధం నిలుస్తుంది.
తప్పనిసరి అని గ్రహించాలి
ఒక్కోసారి దూరంగా ఉంటున్నాం అని.. ఒకరి ఉద్యోగం వదిలి మరొకరు రావాలంటూ ఒత్తిడి తెస్తారు. ఇద్దరూ ముందే అనుకుని ఒక మాట మీద ఉండి, తీరా తప్పంతా ఒకరిమీదే తోసేయకూడదు. ఆర్థిక అవసరాలు, కుటుంబ పరిస్థితుల కోసం దూరంగా ఉంటున్నాం అని ఎవరి మనసుకు వాళ్లు సర్దిచెప్పుకోవాలి
ఒంటరితనం దూరమిలా!
మనుషులు దూరంగా ఉన్నా.. ఆన్‌లైన్‌లో బహుమతులు పంపుకొని సర్‌ప్రైజ్‌ ఇచ్చుకోవడం, సొంతగా చేతితో ఉత్తరం రాసి ప్రేమను వ్యక్తపరచడం, వీడియో కాల్స్‌తో సంభాషించడం ఇవన్నీ ఒకరిమీద మరొకరికి ప్రేమను పెంచుతాయి.
దాపరికాలు వద్దు
ఇద్దరి మధ్య దాపరికాలు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి, బంధుమిత్రులతో సమస్యలు, కుటుంబ వ్యవహారాలువంటి వాటిల్లో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యమైన సందర్భాల్లో ఏకాభిప్రాయంతో అడుగు ముందుకు వేయాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని