గెడ్డంతో.. పోజు కొడదాం
close
Updated : 01/05/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గెడ్డంతో.. పోజు కొడదాం

కరోనా కాలం. బయటికి వెళ్లి గెడ్డం తీసుకోవడానికీ జంకే కాలం. మరేం చేయగలం? కొన్నాళ్లు అడ్డంగా పెంచేయక తప్పదు. ఎలాగూ తప్పదు కాబట్టి కుర్రకారూ.. గెడ్డాన్ని కాస్త స్టైలిష్‌గా మలుచుకుందాం ఇలా.

ట్రిమ్మింగ్‌: మాసిన గెడ్డం అందవిహీనంగా కనిపించడమే కాదు.. మనకు వ్యక్తిగత శ్రద్ధ తక్కువనే భావన కలగజేస్తుంది. ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్‌ చేసుకుంటే కుర్రాళ్లు హుందాగా కనిపిస్తారు.
ఆయిల్‌: వేసవి కదా.. గెడ్డం మొదళ్లలో చర్మం గరుకుగా తయారవుతుంది. ఎక్కువ పొడిబారితే టాన్‌ గీతలు, సన్‌బర్న్స్‌ ఏర్పడతాయి. ఈ ఇబ్బంది రాకుండా ఉండాలంటే షాంపూ, తర్వాత గెడ్డానికి నరిషింగ్‌ ఆయిళ్లు రాయాలి.
షాంపూ: హెయిర్‌ షాంపూలాగే మార్కెట్లో బియర్డ్‌ షాంపూలు లభిస్తున్నాయి.గడ్డంలోని సూక్ష్మమైన దుమ్మూధూళిని ఇవి శుభ్రం చేస్తాయి. సల్ఫేట్‌, సిలికాన్‌, పారాబెన్స్‌ మిశ్రమాలు లేనివైతే బెటర్‌.
నీరు: వేసవిలో అధికంగా నీరు తాగడం ఆరోగ్యానికే కాదు.. అందానికీ ముఖ్యమే. ఎక్కువగా నీరు తాగుతుంటే హైడ్రేట్‌ అయ్యి.. చర్మంతో పాటు గెడ్డం మెరిసి పోతుంటుంది.
శుభ్రం: షాంపూ, క్రీం, ఆయిల్‌.. గెడ్డానికి ఏది రాయాలనుకున్నా ముందు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా నిద్రకు ఉపక్రమించే ముందే ఇది చేయాలి. అలా చేస్తేనే దురదలాంటివి దరి చేరవు. గెడ్డం నిగనిగలాడుతుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని