నడకతో ఆరోగ్యం.. ఆనందం..
close
Published : 08/05/2021 01:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నడకతో ఆరోగ్యం.. ఆనందం..

సగటు స్త్రీ జీవితంలో పద్దెనిమిదేళ్లు వంటింట్లోనే గడిచిపోతాయట. ఇంటిపనులు చక్కబెట్టడమే పెద్ద శ్రమ, అవి చేస్తూ ఇంట్లోనే మైళ్లదూరం నడుస్తున్నాం కదా ఇంకా వాకింగ్‌ అవసరమా అంటారు కొందరు. కానీ ఎన్ని పనులు చేసినా అది వాకింగ్‌ కిందికి రాదు. వ్యాయామం అసలే కాదు. శరీర భాగాలన్నీ కదిలేలా వేగంగా నడిస్తేనే వాకింగ్‌! అలా నడవడం వల్ల ఏం జరుగుతుందో చూడండి...
* కెలరీలు కరుగుతాయి. అధిక కొవ్వు తగ్గుతుంది. హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
* నరాలకు బలం చేకూర్చి రక్తప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. ఊబకాయం రాదు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం తగ్గుతుంది.
* నడిస్తే కాళ్లనొప్పులొస్తాయనేది అపోహ. క్రమం తప్పక వాకింగ్‌ చేయడంవల్ల ఎముకలు పటిష్టమై మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
* కండరాలకు బలం చేకూరుతుంది. శరీరం దృఢపడుతుంది. కొండ ప్రాంతంలో నడక వల్ల ఆయాసం వచ్చినప్పటికీ గుండెకు మరింత మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఉద్వేగాలు తగ్గుతాయి. ఆహ్లాదం కలుగుతుంది. జీవన ప్రమాణం పెరుగుతుంది, మృత్యువాతపడే ప్రమాదం 20 శాతం తగ్గుతుందని పరిశోధనలు వెల్లడించాయి.
* మెదడు ప్రశాంతంగా ఉంటుంది కనుక ఒత్తిడి తగ్గడమే కాక సృజనాత్మకత పెరుగుతుందని సర్వేలు తేల్చాయి. అంతేకాదు హాయిగా నిద్రపడుతుంది.
* 70-90 ఏళ్ల వ్యక్తుల మీద వర్జీనియా విశ్వవిద్యాలయం జరిపిన సర్వేలో వాకింగ్‌ చేసేవారిలో అల్జీమర్స్‌ వచ్చే అవకాశం చాలా స్వల్పమని తేలింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని