Super Foods: ఈ ఆరూ.. పిల్లల సూపర్‌ ఫుడ్స్‌
close
Updated : 02/06/2021 07:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Super Foods: ఈ ఆరూ.. పిల్లల సూపర్‌ ఫుడ్స్‌

పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆరురకాల సూపర్‌ఫుడ్స్‌ను అలవాటు చేయాలని సూచిస్తున్నారు నిపుణులు... అవేంటో చూడండి...

సీజన్లలో వచ్చే పండ్లను పిల్లలకు అలవాటు చేయాలి. ఈ వేసవిలో మామిడి, పుచ్చ, నారింజ, బత్తాయి, జామ, ద్రాక్ష పండ్లను తినిపించాలి. క్యాప్సికమ్‌, ఆనపకాయ, దోస, బీన్స్‌ వంటి కూరగాయలతోపాటు తాజా ఆకుకూరలు రోజూ కనీసం మూడు రకాలు వారి భోజనంలో ఉండేలా చూడాలి. దీనివల్ల వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు ఎదుగుదలా బాగుంటుంది.
* కొబ్బరినీళ్లు... విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కొబ్బరినీళ్లు అమృతంతో సమానం. ఇవి డీహైడ్రేషన్‌కు గురి కాకుండా కాపాతాయి. శక్తినీ ఇస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చిన్నారులతో రోజూ తాగిస్తే చాలా మంచిది.
* బాదం... విటమిన్‌ ఇ, మాంగనీస్‌ ఉండే బాదంలో వ్యాధులను దరికి చేరకుండా చేసే సామర్థ్యం ఎక్కువ. రోజూ రాత్రి నానబెట్టిన ఆరులేదా ఏడు బాదం పప్పులను ఉదయాన్నే పిల్లలతో తినిపిస్తే కొత్తకణాల ఉత్పత్తిలో తోడ్పడటంతోపాటు శక్తినీ పెంచుతాయి.
గోల్డ్‌మిల్క్‌... గోరువెచ్చని పాలల్లో చిటికెడు ఆర్గానిక్‌ పసుపు వేసి రోజూ ఒకసారైనా తాగించాలి. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
* చిరుధాన్యాలు.. వారానికి ఒకటి లేదా రెండు సార్లు చిరుధాన్యాల కిచిడీని తినిపించాలి. అందులో కూరగాయల ముక్కలు వేస్తే మరీ మంచిది. ఈ ధాన్యాలతో చేసే బిస్కట్లు ఇచ్చినా వీటిలోని పోషకాలు, పీచు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
సలాడ్స్‌... స్నాక్స్‌ కావాలనప్పుడల్లా తాజా పండ్లు లేదా కూరగాయల సలాడ్స్‌ను చేసి రుచి చూపించాలి. అప్పుడప్పుడు వారికిష్టమైన పాప్‌ కార్న్‌, బ్రెడ్‌, గుడ్లు, కూరగాయలతో కలిపి శాండ్‌ విచ్‌ చేసిస్తే ఇష్టంగా తింటారు. వాటిలోని పోషకాలు నిండైన ఆరోగ్యాన్ని అందిస్తాయి. నీళ్లు బాగా తాగేలా చూడాలి. ఇవన్నీ వాళ్లకు అలవాటు అవ్వాలంటే వారితోపాటు పెద్దవాళ్లూ కూడా పాటించాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని