TS News: ‘కోటి డోసుల’ ఆశలపై నీళ్లు
close
Updated : 05/06/2021 09:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ‘కోటి డోసుల’ ఆశలపై నీళ్లు

గ్లోబల్‌ టెండర్లకు స్పందన కరవు  

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ టీకా గ్లోబల్‌ టెండర్లలో నిరాశే ఎదురైంది. కోటి డోసుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లకు దరఖాస్తులు ఆహ్వానించగా.. శుక్రవారం(4న) గడువు ముగిసే సమయానికి ఒక్క సంస్థ కూడా టెండర్‌లో పాల్గొనలేదు. ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్‌ టీకా సంస్థల నుంచి టెండర్లు వస్తాయని ఆరోగ్యశాఖ ఆశించగా.. వాటి నుంచీ స్పందన కరవైంది. 18-44 ఏళ్ల మధ్య వయస్కులు రాష్ట్రంలో సుమారు 1.90 కోట్ల మంది ఉండగా.. వీరికి రెండు డోసుల టీకాలు అందించడానికి వృథాతో కలిపి సుమారు 4 కోట్ల డోసులు అవసరమవుతాయి. ఇందులో ముందుగా కోటి టీకాలను గ్లోబల్‌ టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ సంస్థలు టెండర్లలో పాల్గొనడం ద్వారా టీకాల లభ్యత అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్రంలో లబ్ధిదారులకు వేగంగా టీకాలు అందించవచ్చని భావించింది. కానీ టెండర్లలో ఒక్క సంస్థా పాల్గొనకపోవడంతో.. అర్హులైన లబ్ధిదారులకు సత్వరం టీకాలు అందజేయడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతానికి దేశీయ ఉత్పత్తిదారులైన భారత్‌ బయోటెక్‌ నుంచి 10 లక్షల డోసులు, సీరం సంస్థ నుంచి 7 లక్షల డోసులు కొనుగోలు చేయనుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని