TS News: ‘తాపీ’గా చెప్పాడు..ఏం కాలేదని
close
Updated : 20/06/2021 08:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ‘తాపీ’గా చెప్పాడు..ఏం కాలేదని

కొత్తూరు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వాహనం, బైకు ఢీకొన్నాయి. ద్విచక్ర వాహనదారుడు రోడ్డు పక్కన పడిపోయాడు. అయ్యో అనుకుని అటు వెళ్లే ప్రయాణికులలో ఒకరు 108కు ఫోన్‌ చేయగా, మరొకరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడున్న వారందరిలోనూ ఏమైందోనన్న కంగారు.. ఇంతలో అంబులెన్స్‌ రానే వచ్చింది. ‘కొన ఊపిరితో ఉన్నట్టున్నాడు.. అంబులెన్స్‌లో త్వరగా ఎక్కించండి..’ అంటుండగానే బాధితుడు వెంటనే లేచి నిలబడ్డాడు. ‘అంబులెన్సా.. నాకేం కాలేదు. అలా ఊరకే పడుకున్నా అంతే..’ అంటూ తాపీగా సమాధానం ఇచ్చారు. అప్పటి వరకు కంగారు పడిన వారంతా..మా సమయం వృథా చేశావంటూ ఒకింత కోపాన్ని ప్రదర్శించారు. ఈ సంఘటన కొత్తూరు పురపాలిక పరిధిలోని తిమ్మాపూరు జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన బాబూరావు కొత్తూరులో తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తిమ్మాపూరు నుంచి కొత్తూరు వైపు మోపెడ్‌పై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. అతని వెనకే వచ్చిన సన్నిహితుడు నీళ్లు తాగించి ఇంటికి తీసుకెళ్లాడు. మద్యం తాగి అడ్డదారిలో రావడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇతని నిర్వాకంతో షాద్‌నగర్‌ నుంచి అంబులెన్స్‌ హుటాహుటిన రావలసి వచ్చింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని