చరవాణికి డబ్బు కడితే.. సబ్బు పంపారు
close
Published : 10/07/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చరవాణికి డబ్బు కడితే.. సబ్బు పంపారు

రూ.10 వేల జరిమానా విధించిన జిల్లా కమిషన్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌-2లో తొలి తెలుగు తీర్పు వెలువడింది. చరవాణికి డబ్బు చెల్లిస్తే.. సబ్బు, డిటర్జెంట్‌ పౌడర్‌ పంపడంతో బాధితుడు కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్‌ బాధితుడికి అనుకూలంగా తెలుగులో తీర్పుఇచ్చింది. ఎస్సార్‌నగర్‌ బీకేగూడకు చెందిన పి.విజయ్‌కుమార్‌ 2019 డిసెంబరు 19న రూ.11,990 చెల్లించి, అమెజాన్‌లో ఒప్పో చరవాణిని ఆర్డర్‌ చేశారు. ఆ ఫోన్‌కు బదులుగా సబ్బు, డిటర్జెంట్‌ పౌడర్‌ ప్యాకెట్‌లతో కూడిన పార్శిల్‌ పంపారు. పార్శిల్‌ పెట్టె విరిగిపోయి ఉంది. ఈ విషయాన్ని అమెజాన్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చి, సంబంధించిన చిత్రాలను జతచేసినా, స్పందన లేకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన జిల్లా కమిషన్‌-2 అధ్యక్షుడు వక్కంటి నర్సింహారావు, సభ్యులు పారుపల్లి జవహర్‌బాబు, ఆర్‌.ఎస్‌.రాజశ్రీతో కూడిన బెంచ్‌ అమెజాన్‌ సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తించింది. సేవా లోపం స్పష్టంగా ఉందని ఏకాభిప్రాయానికి వచ్చి ఫిర్యాదీదారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆయన చెల్లించిన మొత్తానికి, 9 శాతం వడ్డీ చెల్లించాలని, నష్టపరిహారంగా మరో రూ.10 వేల జరిమానా, కేసు ఖర్చుల కింద రూ.5 వేలు చెల్లించాలని ప్రతివాదులను ఆదేశించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని